షూటింగ్ మొదలు పెట్టేసిన 'కాటమరాయుడు'

Pawan Kalyan new movie Katama Rayudu movie shooting started

05:12 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

Pawan Kalyan new movie Katama Rayudu movie shooting started

'సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కసిగా మాంచి మూవీకోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తరవాత మూవీ 'కాటమరాయుడు' అని కూడా తెలుసు. అయితే ఈ చిత్రం షూటింగ్ బుధవారం సికింద్రాబాద్ లో ప్రారంభమైంది. ఈ నెల 24 నుంచి పవన్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరికొత్త ప్రేమికుడిగా కనిపించనున్నారు. కామెడీ, యాక్షన్, లవ్ స్టోరీతో కూడిన కాటమరాయుడు మూవీలో పవన్ సరసన శృతిహాసన్ నటిస్తుంది. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి యామినీ భాస్కర్ కీలక రోల్ పోషిస్తోంది. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. కథ: ఆకుల శివ, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి. దీంతో ఇటీవల బహిరంగ సభలతో సందడి చేసిన జనసేన అధినేత మళ్ళీ రీల్ లైఫ్ స్టార్ట్ చేసినట్టేనని చెప్పచ్చు.

English summary

Pawan Kalyan new movie Katama Rayudu movie shooting started