పవర్ స్టార్ .. కాటమ రాయుడే

Pawan Kalyan New Movie Named Katamarayudu

10:37 AM ON 2nd September, 2016 By Mirchi Vilas

Pawan Kalyan New Movie Named Katamarayudu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ అంటే, కేవలం అభిమానులు మాత్రమే కాదు, టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. సినిమా ప్రారంభమైన దగ్గరి నుంచి విడుదలయ్యే వరకు ఆయన సినిమాకు సంబంధించిన ప్రతీ అంశం ఉత్సుకతను కలిగిస్తుంది. ఇక అభిమానుల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. జల్సా, పులి, పంజా, గబ్బర్ సింగ్ , సర్దార్ గబ్బర్ సింగ్ ఇలా ఆయన సినిమా టైటిళ్లు కూడా మాస్ ను మెప్పించేలా ఉంటాయి.

అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కల్యాణ్ కాటమరాయుడా కదిరి నరసింహుడా.. అంటూ పాట పాడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అదే టైటిల్ అయింది. తాజాగా కాటమరాయుడు గా పవన్ కల్యాణ్ రాబోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం పవన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్ కు సంబంధించి నిర్మాత శరత్ మరార్ ఓ ప్రకటన చేశాడు. కాటమరాయుడు పేరుతో పవన్ సినిమాను నిర్మించనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

గోపాల గోపాల దర్శకుడు కిశోర్ కుమార్ పార్దసాని(డాలీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యాక్షనిస్టు ప్రేమకథతో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఆకుల శివ కథను అందించాడు.

ఇవి కూడా చదవండి:కమెడియన్స్ లేని 'గ్యారేజ్'!

ఇవి కూడా చదవండి:లీకైన 'శాతకర్ణి' ఫోటోలు

English summary

Power Star Pawan Kalayn Birthday was today and today Producer Sharrath Marar released the new look of Pawan Kalayan's Upcoming film "KatamaRayudu". Gopala Gopala Fame Director Dolly was directing this movie and Anup Rubens to give music to this movie.