కడప కింగ్.. టు హండ్రెడ్ సెంటర్స్.. హండ్రెడ్ డేస్

Pawan Kalyan new movie title is Kadapa King

11:25 AM ON 17th June, 2016 By Mirchi Vilas

Pawan Kalyan new movie title is Kadapa King

'సర్దార్ గబ్బర్' సింగ్ కి ఊహించని ఎదురుదెబ్బ తగలడంతో, ఆ తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచి, వరుసగా సినిమాలు చేస్తున్నాడు. సర్దార్ తర్వాత పవన్-ఎస్.జె.సూర్య దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో పవన్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. ఇక ఈ మూవీలో పవన్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తాడట. ఫ్యాక్షన్ లీడర్ ప్రేమకథ ఎలా ఉంటుందన్నదే సినిమా మెయిన్ స్టోరీ లైన్ గా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సేనాపతి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు నిన్నటి వరకు వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు ఆ టైటిల్ ను పక్కన పెట్టినట్టు చెబుతున్నారు.

ఈ సినిమా నిర్మాత శరత్ మరార్ ఇటీవలే కడప కింగ్ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లు కూడా ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తోంది. ఈ సినిమా అయితే పక్కా మాస్ గా ఉండడంతో పాటు పవన్ కు కరెక్టుగా సెట్ అవుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఇక అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ యేడాది చివర్లో లేదా వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పక్కా ప్రణాళికతో ఈ సినిమా తీయబోతున్నట్లు చెబుతున్నారు.

English summary

Pawan Kalyan new movie title is Kadapa King