సంక్రాంతికల్లా పవర్ స్టార్ మూవీ రెడీ చేసేస్తారట!

Pawan Kalyan New Movie To Get Ready For Sankranthi

11:02 AM ON 2nd August, 2016 By Mirchi Vilas

Pawan Kalyan New Movie To Get Ready For Sankranthi

ఏపీ కి హోదా పై రాజకీయ వేడి రగులుతుండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందన ఎలా ఉంటుందని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ మాత్రం తన సినిమా షూటింగులతో బిజీ కాబోతున్నాడు. బ్రిటన్ లో తెలుగువారు నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని హైదరాబాద్ తిరిగి వచ్చిన పవన్, తన తాజా ప్రాజెక్టులపై డైరెక్టర్ డాలీ తోను, ప్రొడ్యూసర్ శరత్ మరార్ తోను చర్చించాడు. అలాగే తన ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా మంతనాలు జరిపాడు,

తమిళ మూవీ వీరం రీ-మేక్ షూటింగ్ ను డాలీ పవన్ లేకుండానే ఈ నెల 6 న స్టార్ట్ చేస్తాడని, ఈ నెల రెండో వారం నుంచి ప్రారంభమయ్యే షెడ్యూల్ లో పవన్ పాల్గొంటాడని తెలుస్తోంది. సంక్రాంతి కల్లా ఈ మూవీ రిలీజ్ కావాలని ఈ హీరో డెడ్ లైన్ పెట్టాడట. దీంతో డాలీ ఈ ప్రాజెక్టు షూటింగ్ ను వచ్చే నవంబరు లేదా డిసెంబరు కల్లా పూర్తి చేస్తాడని అంటున్నారు. దీని షూటింగ్ ఎక్కువగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగే సూచనలున్నాయి. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ తో సినిమా మొదలుపెడతాడట.

ఇవి కూడా చదవండి:ప్రిన్స్ 'మురారి' పాటపై రచ్చరచ్చ.. గతం తవ్విన కృష్ణవంశీ

ఇవి కూడా చదవండి:బాహుబలి ముందు చతికిలబడ్డ కబాలి

English summary

Power Star Pawan Kalyan was signed a new movie with Director Dolly and they were going to remake hero Ajith's Tamil Super Hit film "Veeram". This movie unit was planning to release this movie for Next year Sankranthi festival.