పవన్-ఎస్.జే.సూర్య ల సినిమా టైటిల్ ఫిక్స్

Pawan Kalyan Next Movie Title

03:10 PM ON 16th April, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Next Movie Title

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసాడో వేరే చెప్పనవసరం లేదు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదలైన తరువాత తన సినిమాకు కొంత సమయం తీసుకుంటాడు అనుకున్న పవన్ వెంటనే తన తరువాతి సినిమాను స్టార్ట్ చేసాడు.

ఇవి కూడా చదవండి:మన హీరోలు - హైక్లాస్ ఇళ్ళు

పవన్ ఇటీవల పలు ఇంటర్వ్యూలలో కుడా తన తరువాత సినిమా ఎస్.జే. సూర్య తో ఉంటాడని చెప్పినట్లు గానే తన కెరీర్ లో ఖుషి లాంటి ఒక సూపర్ హిట్ ని , పులి లాంటి అట్టర్ ఫ్లాప్ ని ఇచ్చిన ఎస్.జే.సూర్య తో ఒక సినిమా కసరత్తులు మొదలుపెట్టేసాడు.ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ గా అనుప్ రూబెన్స్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో రామ జోగయ్య శాస్త్రి రాసిన ఒక పాటకు సంబంధించి రికార్డింగ్ కుడా పూర్తయ్యిందట.

ఇవి కూడా చదవండి:మెగా కూతురు కి ఎన్ టి ఆర్ అంటే పిచ్చి అట

సర్దార్ సినిమా తీసిన శరత్ మారార్ ఈ సినిమాను కుడా నిర్మించనున్నాడు . ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలోనే రానుందని సమాచారం. ఎస్.జే.సూర్య దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకు "హుషారు" అనే టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేసారట. ఖుషి సినిమా సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుందని సమాచారం .2001 లో విడుదలైన ఖుషి సినిమా వచ్చి ఇప్పటికి 15 సంవత్సారాలు పూర్తయ్యింది . ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయట . మరి ఈ సినిమా ఖుషి సీక్వెల్ గా ఖుషి సినిమా స్టొరీ లైన్ తో రాబోతోందా .! లేక ఫ్రెష్ స్టొరీ తో తెరకెక్కనుందా తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:ఊపిరిలో పెయింటింగ్ అఖిల్ దా.. తమన్నా దా..

మొత్తానికి సర్దార్ విడుదలైన కొద్ది రోజులకే పవన్ కళ్యాణ్ మరో సినిమా చేస్తుండడంతో పవన్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. అప్పట్లో ఖుషి సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే , ఇప్పుడు ఖుషి సీక్వెల్ గా రానున్న ఈ సినిమా ఇంకెలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

పవర్ స్టార్ కి బీర్లతో అభిషేకం!

సుమ భర్తతో రష్మి సరసాలు

సెక్స్ చేయమని రోడ్డుపై నగ్నంగా చిందులేసిన మహిళ (వీడియో)

English summary

After Sardaar Gabbar Singh Movie Power Star Pawan Kalyan was started a new movie with S.JSuray. This movie was named as "Husharu" .Anup Rubens was going to be Compose Music to this movie.