మెగా పండగలో మళ్ళీ అదే లోటు

Pawan Kalyan Not Attended To Chiru 150th Movie Launch

10:16 AM ON 30th April, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Not Attended To Chiru 150th Movie Launch

మొన్న మెగాస్టార్ రెండవ కుమార్తె శ్రీజ పెళ్లి , నిన్న మెగాస్టార్ 150వ చిత్రం ప్రారంభం...అక్కడా ఇక్కడా కూడా ఓ వ్యక్తిలేని లోటు అలానే కనిపించిందని అంటున్నారు. ఇంకెవరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...ఎందుకు హాజరవ్వలేదనే చర్చ. ఇక పూర్తివివరాల్లోకి వెళ్తే , 2016 ఏప్రిల్ 29 శుక్రవారం ఈ తేదీకి మెగాస్టార్ ఇంట బోలెడంత ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఎనిమిదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా ప్రారంభం కావడం ఒకటి విశేషం అయితే.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అంటూ ఇంటిపేరుతో రామ్ చరణ్ సొంత బ్యానర్ స్టార్ట్ చేయడం మరో విశేషం. ఈ వేడుకకు మెగాస్టార్ ఫ్యామిలీ అంతా తరలివచ్చారు. అటు అల్లు వారి కుటుంబం నుంచి కూడా బంధువులు వచ్చారు. ఇక మెగాస్టార్ మేనల్లుళ్లు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు.

ఇవి కూడా చదవండి: ప్రపంచంలో అతి పెద్ద శివలింగం ఎక్కడ ఉందో తెలుసా?

అసలీ ఫంక్షన్స్ సినిమాకి సంబంధించనవే అయినా.. చిరంజీవి మాత్రం దీన్నో ప్రైవేట్ ఈవెంట్ గానే కన్సిడర్ చేశారు. అందుకే మీడియా తో పాటూ అభిమానులను కూడా దూరం పెట్టారు. ఇంతమంది ఉన్నా.. అక్కడ మాత్రం ఒక లోటు కనిపించింది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం. కొణిదెల అనే పేరుపై బ్యానర్ స్టార్ట్ చేసినపుడు కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా హాజరు కావాలని ఆశించడంలో తప్పేం లేదు. కానీ పవన్ మాత్రం ఈ వేడుకలో లేడు. కారణాలు ఏమైనా.. పవర్ స్టార్ దర్శన భాగ్యం ఎవరికీ కలగలేదు.

ఇవి కూడా చదవండి: ప్రారంభమైన చిరు 150వ సినిమా

అసలు ఇలాంటి ఈవెంట్స్ కి వచ్చే అలవాటు పవన్ కి లేదని సరిపెట్టుకుందామన్నా. రీసెంట్ గానే సర్దార్ ఆడియో వేడుకకు మెగాస్టార్ వచ్చారు. అందుకోసమైనా అన్నయ్య సినిమా ప్రారంభ వేడుకకు పవర్ స్టార్ హాజరైతే బాగుండేదని అంతా అనుకున్నారు. మొత్తానికి మెగా ఇంట మరో రసవత్తర చర్చకు ఇది దారితీస్తోంది.

ఇవి కూడా చదవండి: రామ్ చరణ్ తేజ్ ప్రొడక్షన్ హౌస్ లోగో ఇదే

English summary

Mega Star Chiranjeevi's 150th film launch event was done yesterday with hiranjeevi Family Members. Ram Charan's New Movie banner "Konidela Prodcutions" was also launched yesterday. Pawan Kalyan not attended to this function and all the mega heroes were attended to this launch event.