వెడ్డింగ్  కార్డులపైనా పవర్ స్టారే

Pawan Kalyan Photo On Wedding Card

12:10 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Photo On Wedding Card

తమ అభిమాన నటుల సినిమాలు రిలీజైతే బ్యానర్లు , ఫ్లేక్స్ లు కట్టడం , తెర పై పూలు విసరడం, చీరలు - దుప్పట్లు వంటి సేవా కార్యక్రమాలు చేయడం చూస్తూనే వున్నాం. ఇంకా తమ తమ పెళ్లిళ్లకు అభిమాన నటుడు రావాలని , వస్తేనే పెళ్లి ఉంటుందని భీష్మించి , సాధించుకునే అభిమానులూ సరేసరి. అయితే ఏకంగా వెడ్డింగ్ కార్డులపై దేవుడి బొమ్మ బదులు తమ అభిమాన నటుల బొమ్మలు వేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇలా వేసుకున్నదెవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానులే. వీరాభిమాని అనేకంటే వీర భక్తుడు అంటే సబబుగా ఉంటుందేమో, తాజాగా ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన వ్యక్తి పేరుతో ఈ వెడ్డింగ్ కార్డు చూస్తే స్పష్టమవుతోంది. ఆ వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. వెడ్డింగ్ కార్డుపై పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు జనసేన పార్టీ లోగో కూడా వేసారు. దీంతో ఇపుడు ఈ వెడ్డింగ్ కార్డు అంశం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.,టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సినీ స్టార్. పైగా మెగా కుటుంబంలో ప్రస్తుతం యమ జోరు మీదున్న హీరో కూడా. సాధారణంగా అంద‌రి హీరోల‌కు ఫ్యాన్స్ ఉంటారు కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి మాత్రం ఫాన్స్ కాదు భ‌క్తులుంటారు అని అంటుంటారు. ఇప్పుడు ఆ మాట‌కు అర్థాన్ని చూపించేలా వెడ్డింగ్ కార్డు మీద దేవుడు బొమ్మ బదులు పవన్ ఫోటో వేసుకున్న ఉదంతం కనిపిస్తోంది. ఇంకా ఆ వెడ్డింగ్ కార్డుపై, 'ఈ వివాహానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా శ్రేయోభిలాషులు తప్పక విచ్చేసి మమ్ములను ఆశీర్వదించ ప్రార్థన' అని ఉండటం విశేషంగా చర్చించుకుంటున్నారు.

English summary

Power Star Pawan Kalyan has huge fan following among the heroes.Recently a new peak touched by Power Star Fans in Andhra Pradesh new capital Amaravathi region.A wedding card printed with Pawan Kalyan and Jana Sena Party logo inviting the Fans and well wishers to attend wedding ceremony.