స్టార్ నిర్మాత పై జాలి పడ్డ పవన్!!

Pawan Kalyan pity on star producer

12:27 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Pawan Kalyan pity on star producer

పవర్‌స్టార్‌ వపన్‌కళ్యాణ్‌ 'నాన్నకుప్రేమతో' సినిమా నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌కి పెద్ద షాక్‌ ఇచ్చాడు. పవన్‌ 'అత్తారింటికి దారేది' సినిమాకి నిర్మాత ప్రసాద్‌ 2 కోట్లు చెల్లించాల్సి ఉంది. చాలా రోజులు గడిచినా పవన్‌ కు ఇవ్వకపోవడంతో పవన్‌ ప్రసాద్ పై ఫిర్యాదు చేశాడు. నాన్నకుప్రేమతో సినిమా విడుదలకు ఒకరోజు ముందు ప్రసాద్‌ పై పిర్యాదు నమోదు చేశాడు. తన రెండు కోట్ల లెక్కను తేల్చిన తర్వాతే నాన్నకుప్రేమతో సినిమా విడుదల చెయ్యాలని హుకుం జారీ చేశాడు. దీంతో నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ పవన్‌ను బ్రతిమాలుకుని ఈ సినిమాను విడుదల చేసుకున్నాడు. ఇప్పుడు నాన్నకుప్రేమతో సినిమా బాగానే నిలబడగలిగింది.

ప్రసాద్‌ కూడా పవన్‌కి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేశాడట. కానీ ముందుగా అనుకున్నట్లు రెండు కోట్లు కాదు, కోటిన్నర మాత్రమే. పవన్‌ నిర్మాత పరిస్థితి చూసి జాలిపడి తనకివ్వవలసిన మొత్తంలో 50 లక్షలు తగ్గించాడట. ప్రసాద్‌ కోటీ యాబైలక్షల రూపాయలు సింగిల్‌ పేమెంట్‌లో పవన్‌కి ఇచ్చేశాడట. ఇకపోతే దక్శకుడు త్రివిక్రమ్‌కి కూడా ఈ నిర్మాత కొద్ది మొత్తంలో భాకీ పడ్డాడట. త్రివిక్రమ్‌ పవన్‌లా జాలి చూపించి డిస్కౌంట్‌ ఇస్తాడేమో.

English summary

Pawan Kalyan didn't take 50 lakhs from star producer BVSN Prasad. Actually BVSN Prasad have to give 2 crores remuneration for Pawan Kalyan but he didn't take from the producer. Now the producer gave 1.5 crores to Pawan.