పవన్ ఎత్తుగడ అదేనా ?

Pawan Kalyan Plan On Special Status To AP

11:16 AM ON 19th May, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Plan On Special Status To AP

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రసర్కారు అనుసరిస్తున్న తాజా వైఖరి పట్ల జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. తాను స్వయంగా బయటకు వచ్చి.. తన ఇమేజ్ ను పణంగా పెట్టి.. ఏపీకి అన్నివిధాలుగా మోడీ సాయం చేస్తారని చెప్పాక కూడా మోడీ పరివారం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకోటాన్ని జీర్ణించు కోలేకపోతున్నాడట. మోడీ సర్కారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పటం అంటే.. తాను చెప్పిన మాట అబద్ధమైందన్నట్లు పవన్ ఆందోళన చెందుతున్నట్లు అలాగే ఇది తన విశ్వసనీయతను దెబ్బ తీసే పరిణామంగా వుందని అంటున్నట్లు చెబుతున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు.. ఏపీని ఆదుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్యాకేజీ విషయంలోనూ మోడీ సర్కారు సానుకూలంగా లేకపోవటం.. ఈ విషయాన్ని కేంద్రానికి చెందిన మంత్రులు.. పలువురు బీజేపీ నేతలు చాలా క్యాజువల్ గా చెప్పేయటం నేపధ్యంలో పవన్ ఫైర్ అవుతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ మీద వార్ ప్రకటించినా.. అది తొందరపాటు అవుతుందని.. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల వ్యవధి ఉండటం.. కేంద్రంలో బలంగా ఉన్న మోడీని వ్యతిరేకించటం వల్ల ఏపీకి కలిగే ప్రయోజనం ఏమీ ఉండదన్న కోణంలో పవన్ యోచన చేస్తున్నట్లు వినికిడి. ఎప్పటికప్పుడు తన ఆంతరంగికులతో ఈ విషయమై చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:సెక్స్ సరదాల కోసం బ్యాంకు నుండి తెలివిగా 100 కోట్లు కొట్టేసాడు

ఇక మోడీ సర్కారు తీరు పట్ల ఏపీ అధికారపక్షం టీడీపీ ఏపీ ప్రయోజనాల పరిరక్షణకు ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారు? వంటి విషయాలపై కూడా పవన్ ఓ కన్నేసినట్లు చెబుతున్నారు. ఈ విధంగా ఒక వ్యూహమైతే.. కేంద్రం తీరు మీద తమ పార్టీ కార్యకర్తలతో నిరసనలు చేపట్టే అంశం మీద కూడా తర్జన భర్జన పడుతున్నట్లు అంటున్నారు. ఈ నిరసనలకు ప్రజా స్పందన ఎలా ఉందన్న విషయాన్ని చెక్ చేసుకోవటం.. దానికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ సిద్దం చేయాలన్న ఆలోచనలో ఉన్నారనే సంకేతాలు వస్తున్నాయి.

ఏది ఏమైనా ఇలాంటి వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయాలన్న ఉద్దేశంలో ఉన్న పవన్ అందుకు తగ్గట్లే వ్యవహరిస్తున్నారని అతని సన్నిహితులు చెప్పే మాట. కాకపొతే పలు విషయాలపై సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించే పవన్ ఈసారి అందుకు కామ్ గా ఉన్నాడో అర్ధం కావడం లేదని మరో వర్గం వాదన. అయితే ప్రత్యేక హోదా మీద మోడీ సర్కారు తన వైఖరిని స్పష్టం చేసిన తర్వాత కూడా పవన్ స్పందించకపోవటం వ్యూహాత్మకమేనని సన్నిహితులు అంటున్నారట. ప్రత్యేకహోదా మీద కేంద్రం మరిన్ని తప్పులు చేసే వరకూ వెయిట్ చేసి.. ఆ తర్వాత గళం విప్పాలని, ఈలోగా ఎన్నికల కాలం కూడా దగ్గర పడుతుందని పవన్ యోచనలో వున్నట్లు అంటున్నారు. మొత్తానికి పవన్ స్పందన బట్టి ఎపిలో రాజకీయాలు ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుంటాయని విశ్లేషకుల అంచనా ... చూద్దాం .. ఏమి జరుగుతుందో.

ఇవి కూడా చదవండి:పవన్ గురించి బన్నీ అలా ఎందుకన్నాడో క్లారిటీ ఇచ్చేసాడు(వీడియో)

ఇవి కూడా చదవండి:సూపర్ స్టార్ తండ్రిగా మరో సూపర్ స్టార్?

English summary

Power Star Pawan Kalyan Played a key role in 2014 elections in Andhra Pradesh and Telangana States. In election time BJP government promised that they will give Special Status to Andhra Pradesh but still now Special Status or Special Package was not given to AP.A recent news that Pawan Kalyan was thinking about next step.