ఈ స్థాయిలో ఉన్నానంటే అన్నయ్య చలవే ...

Pawan Kalyan Praises Chiranjeevi In Sardaar Audio Function

09:28 AM ON 21st March, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Praises Chiranjeevi In Sardaar Audio Function

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమా ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్ నోవాటెల్‌ హోటల్‌లో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఈ సందర్భంగా అన్నదమ్ముల అనుబంధం మరోసారి కనువిందు చేసింది. ఒకరిపై ఒకరు అనురాగం కురిపించుకున్నారు. ఈ సందర్భంగా అన్నయ్యపై ఉండే ప్రేమను తన జీవితంలో జరిగిన ఓ ఘటన ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘నా దృష్టిలో హీరో అంటే అన్నయ్య చిరంజీవే. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి అన్నయ్య, వదినే కారణం. అన్నయ్య సినిమాల్లోకి వెళ్లకముందు అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం వుండేది. అన్నయ్య వచ్చాక ఇక అన్నయ్యే హీరో అనిపించింది. అన్నయ్యపై ప్రేమ అంతర్గతంగా ఉంటుంది. దాన్ని ప్రతిసారీ బయట పెట్టనవసరం లేదు. సమయం సందర్భం వచ్చినపుడు మాట్లాడుతా’. అని చెప్పారు.

అన్నయ్య ఎప్పుడూ షూటింగ్స్‌తో బిజీగా ఉండేవారు. సెట్స్‌ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి పూర్తిగా అలసి పోయేవారు. కనీసం షూ లేస్‌ తీసుకోవడానికి కూడా ఓపిక ఉండేది కాదు. అప్పుడు అతని షూ నేను విప్పేవాణ్ని. ఆ షూ నుంచి వచ్చే చెమట వాసన నాకు కష్ట పడిన తాలూకు సెంటు వాసన లా భావించే వాడిని. బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో శిఖరాలకు చేరుకున్న అన్నయ్య అంటే అందరికీ స్పూర్తి నిచ్చిన మహా వ్యక్తి' అంటూ పవన్ కొనియాడారు.' ఇక రాజకీయాల విషయంలో అన్నయ్యకు నచ్చని పని చేశా. అయితే ఎలాంటి సందర్భంలో ఆలా చేయాల్సి వచ్చిందో దాన్ని అన్నయ్యకు వివరించాను. ఆయన సానుకూలంగా అర్థం చేసుకున్నారు' అని వివరించారు. తమ బంధం వేరు రాజకీయం వేరని పవన్ స్పష్టం చేసాడు.

క్రియాశీలక రాజకీయాల్లోకి

సర్దార్ టైటిల్ సాంగ్ లీక్.. చూస్కో గురూ..

సర్దార్ ఫంక్షన్లో పవన్ ఎమోషనల్ స్పీచ్

ఉత్తర భారత్ సన్నీవేసాలుంటాయి ......

ఖమ్మం, ఛత్తీస్‌ఘడ్‌ ప్రాంతాల మధ్య జరిగే కథ ఆధారంగా సర్దార్‌గబ్బర్‌సింగ్‌ రూపొందించామని పవన్ చెబుతూ, . ఇందులో ఉత్తరభారత దేశానికి సంబంధించిన సన్నివేశాలు సైతం ఉంటాయన్నాడు. దీంతో ఈరోస్‌ అధినేత సునీల్‌ లల్లూ హిందీలోనూ విడుదల చేద్దామన్నారని, అయితే ఈ చిత్రం ఎవరికీ పోటీ కాదని స్పష్టం చేసాడు. చిత్రంలో నటించిన కాజల్‌ అగర్వాల్‌, ముఖేష్‌రుషి, సంజనకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సందర్భంగా అందరూ అమ్మాయిల గురించే చెబుతున్నానని తన గురించి చెప్పట్లేదని ఆలీ చూస్తాన్నాడంటూ చమత్కరించడంతో నవ్వులు విరిశాయి. అలీ లేకుండా ఉంటే తనకు లోటుగా అన్పిస్తుందని అందుకే ప్రతి చిత్రంలోనూ ఆలీ ఉండేలా చూస్తానన్నాడు. అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు బాబీకి కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవానికి ఈ సినిమా గత అక్టోబర్ లో వుడుదల కావాలని, ఆలస్యం అయిందని పవన్ చెబుతూ, చిత్రంలోని ఓ డైలాగ్‌ అభిమానుల కోసం చెప్పి , ముగించాడు.

English summary