వ్యక్తుల్ని వేధించే లైసెన్స్ ఎవరిచ్చారు .. రోహిత్ ఘటనపై ప్రశించిన పవన్

Pawan Kalyan Questioned About Rohit Veluma Isuuse On Twitter

12:00 PM ON 17th December, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Questioned About Rohit Veluma Isuuse On Twitter

ఇకనుంచి రోజూ ప్రశ్నిస్తాననని ప్రకటించిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా తన ప్రశ్నలను సంధించాడు. ఐదు అంశాలపై వరుసగా తన అభిప్రాయాలు చెబుతానన్న పవన్, ముందుగా గోవధ గురించి పలు ప్రశ్నలు వదిలాడు. ఇక తాజాగా హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై వరుస ట్వీట్లు చేసాడు.

'లక్షలాది ఇతర భారతీయుల్లాగే రోహిత్ భాజపాను వ్యతిరేకించారు. అంతమాత్రాన బిజెపి అతడిని వేధించాలా? ఓ పార్టీ సిద్ధాంతాలతో ఏకీభవించనంత మాత్రాన వ్యక్తులను వేధించే లైసెన్సు వారికి ఎవరిచ్చారు? పైగా అతడు ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసన తెలుపుతున్నపుడు ఎలా జోక్యం చేసుకుంటారు? ఇది బీజేపీకే కాదు ఏ పార్టీకైనా వర్తిస్తుంది.

ఒకవేళ ఆయన ఆ పరిస్థితుల్లో తొందరపడి కాషాయీకరణ గురించి విశ్వవిద్యాలయంలో తన వ్యతిరేక వర్గంతో ఏమన్నా అని వున్నా.. కేంద్రం దాన్ని విద్యార్థుల దృక్పథాల మధ్య భేదంగానే చూడాలి. ఒక వేళ వారి శత్రుత్వం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందనుకుంటే సంబంధిత విభాగం ద్వారా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. కానీ కేంద్రం ఈ విషయాన్ని ఎందుకు వ్యక్తిగతంగా తీసుకుందో కారణం తెలియడం లేదు. దాంతో రోహిత్ వేములకు క్యాంపస్ నుంచి సస్పెన్షన్ తో పాటు వెలివేత శిక్ష పడింది. అదే అతడిని ఆత్మహత్యకు పురికొల్పింది. తన వర్గంనుంచి అవసరమైన నైతిక బలం లభించకపోవడం కూడా అందుకు మరో కారణమైంది.

సమాజంలో సమానత్వానికి తావు లేదని తెలియడం వల్ల అతనికి కోపం, నిరాశ కలిగివుంటాయి. మానవీయ దృక్పథంతో మంచి కౌన్సెలింగ్ లభించి ఉంటే తాత్విక చింతన గల ఒక తెలివైన విద్యార్థి ప్రాణాలు కాపాడుకునేవాళ్లం. రోహిత్ వేముల ఆత్మహత్యలో అత్యంత విచారకరమైన అంశం భాజపా వ్యతిరేక పార్టీలన్నీ దాన్ని రాజకీయం చేయడం. వారంతా తమకు అనుకూలంగా దానిని మలచుకుంటే మరోవైపు బిజెపి , మిత్రపక్షాలు ఆయన దళితుడు కాదని నిరూపించడంలో నిమగ్నమయ్యాయి. కానీ అందరూ ఒక ప్రశ్నను మాత్రం మర్చిపోయారు.. భవిష్యత్తులో యువత ఇలా నిరాశా నిస్పృహలతో ప్రాణాలు తీసుకోకుండా చూడాలంటే ఏం చేయాలనే విషయాన్ని వారు విస్మరించారు. ఎప్పటికైనా మన యూనివర్శిటీలు విద్యా వేదికలుగా నిలుస్తాయని, రాజకీయ పార్టీలకు యుద్ధభూములు కావని ఆశిస్తాను' అంటూ ట్వీట్ చేసాడు..

ఇవి కూడా చదవండి: సన్నీకి బంపరాఫర్ - అయినా పైకి చెప్పడంలేదట

ఇవి కూడా చదవండి: పెళ్లిఫంక్షన్ లో నూతన దంపతులు ఎం చేశారో తెలుసా?(వీడియో)

English summary

Power Star Pawan Kalyan was announced previously that he was going to question everyday through his twitter and now he said questioned about HCU Student Rohit Veluma's issue on his Twitter Account.