'కాపు మహాగర్జన' పై పవన్ ప్రెస్ మీట్!!

Pawan Kalyan reacts on Kapu caste incident

11:54 AM ON 1st February, 2016 By Mirchi Vilas

Pawan Kalyan reacts on Kapu caste incident

నవ్యాంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని తునిలో జనవరి 31న కాపు కుల సంఘం ఒక ఐక్యవేదిక నిర్వహించింది. అయితే అనుకోని పరిస్థితుల్లో ఈ మహాగర్జన ఆందోళనకరంగా మారి హింసకు దారి తీసింది. కాపులను బీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపుల కోసం తునిలో పెద్ద ఎత్తున మహా గర్జన నిర్వహించారు. అయితే ఈ మహాగర్జన ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారి చివరకు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టే దాకా వెళ్ళింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెంటనే స్పందించారు. 'జనసేన' అనే పేరుతో ఓ పార్టీని నెలకొల్పి, సమాజ సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ విషయం పై ఓ ప్రెస్ మీట్ నిర్వహించాలని సిద్ధమయ్యారు.

ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ కోసం కేరళలో ఉన్న పవన్ కళ్యాణ్, తుని ఘటన గురించి తెలియగానే షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వెంటనే హైదరాబాద్ వచ్చేశారు. హైదరాబాద్ లో నేడు ఆయన తుని సంఘటన గురించి మాట్లాడేందుకు ఓ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

English summary

Power Star Pawan Kalyan reacts on Tuni Kapu caste incident. He want to put press meet on this incident today in Hyderabad.