షకలకశంకర్‌ను పవన్ రావద్దన్నాడా?

Pawan Kalyan Restricted Shakalaka Shankar From Sardar Audio

01:05 PM ON 23rd March, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Restricted Shakalaka Shankar From Sardar Audio

టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో అంటే మొదటగా గుర్తుకు వచ్చే పేరు పవన్ కళ్యాణ్ . అయన సినిమా వస్తుందంటే చాలు ఇక అభిమానులకు పండగే . ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పవన్ కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ . ఇటీవల ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ లోని నోవోటెల్ హోటల్ లో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. సర్దార్ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా చిరంజీవి హాజారై తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చాటి చెప్పారు.

ఈ విషయం ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ను దేవుడిలా ఆరాధించే ఒక వ్యక్తీ ఆడియో ఫంక్షన్ లో ఆదరగోడతాడని అందరు భావించారు కానీ ఆ వ్యక్తీ మాత్రం ఆడియో ఫంక్షన్లో ఎక్కడ కుడా కనిపించకపోవడంతో ఇది వరకు వచ్చిన పుకార్లు నిజమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకి ఆ వ్యక్తీ ఎవరంటారా..? అతనే జబర్దస్త్ ఫేం " షకలక శంకర్". అవును జబర్దస్త్ టీవీ ప్రోగ్రాం ద్వారా స్టార్ కమెడియన్ గా ఎదిగిన షక లక శంకర్ పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని. జబర్దస్త్ టీవీ షోలో సైతం పవన్ కళ్యాణ్ పై అనేక స్కిట్లు చేసి పవన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

ఇక అసలు విషయానికి వస్తే సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో పవన్‌ కళ్యాణ్ వంటి స్టార్ హీరోతో నటించే అవకాశం రావడంతో శంకర్‌ కి బలుపు బాగా పెరిగిపోయిందని, అంతే కాకుండా సెట్స్‌కి టైమ్‌కి రాకుండా తనకి నచ్చిన టైమ్‌కి ఆలస్యంగా వస్తున్నాడని, ఒక సన్నివేశం విషయంలో శంకర్‌ కో-డైరెక్టర్‌ని చెయ్యి కూడా చేసుకున్నాడని, ఈ విషయం పవన్‌కి తెలిసి పవన్‌ శంకర్‌కి వార్నింగ్‌ ఇచ్చి చంప పగలగొట్టాడని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ షకలక శంకర్ ను ఆడియో వేడుకకు కుడా రావద్దని అన్నాడని పుకార్లు వస్తున్నాయి. ఇలా ఉంటె గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన షకలక శంకర్ ఈ విషయం పై ఇంకా స్పందించకపోవడం గమనార్హం . ఇకనైనా శంకర్ ఈ విషయం పై క్లారిటి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.

ఎవరీ శరత్ మరార్... పవన్‌కు ఎలా బెస్ట్ ఫ్రెండ్ ఎలా అయ్యాడు

విశ్వవ్యాప్తంగా రంగుల హోలీ

బాత్రూం డ్రెస్‌తో నడిరోడ్డు పైన హీరోయిన్‌ హల్‌చల్‌

భార్య నగ్న ఫొటోలే ట్రంప్ కి శాపమా, లాభమా...

అనాధలా ఫుట్ పాత్ పై పడుకున్న కంగన

English summary

Power Star Pawan Kalyan's Upcoming film was Sardaar Gabab Singh and this movie was going to be released on April8th.A news that Pawan Kalyan Slapped Shakalaka Shankar at the time of Shooting and also ordered that not to come to Sardaar Audio Function.Till now Shakalaka Shankar not responded on this issue.