ఉదయం సినిమా.. సాయంత్రం రాజకీయం..

Pawan Kalyan riding two horses at a time

12:21 PM ON 7th November, 2016 By Mirchi Vilas

Pawan Kalyan riding two horses at a time

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోడెడ్ల సవారి మొదలెట్టేసాడా అంటే అవుననే విధంగా వ్యవహారం కనిపిస్తోంది. అన్న మెగాస్టార్ చిరంజీవి సూచనను పాటిస్తూ రెండింటా తన సత్తా చాటబోతున్నాడా అనిపిస్తోంది. ఈ కథ అంతా ఎందుకంటే, పవన్ అభిమానులకు రెండు గిఫ్ట్ లు ఇచ్చాడు. పవన్ తీసుకున్న రెండు నిర్ణయాలు అలాంటివే మరి. ఉదయం క్రేజీ కాంబినేషన్ లో సినిమా ప్రారంభించి, సాయంత్రం తన సొంత పార్టీ జనసేన సంస్థగత నిర్మాణంపై కీలకమైన ప్రకటన చేశాడు. దీంతో తమ అభిమాన హీరో అటు సినిమాలు, ఇటు రాజకీయంలోనూ రెండు బహుమతులు ఇచ్చారని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారట.

1/4 Pages

పవన్ కొత్త సినిమా ప్రారంభమయింది. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం శనివారం ఉదయం 10:49 గంటలకు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలోని దేవాలయంలో జరిగింది. హారికహాసిని క్రియేషన్ బ్యానర్ పై శ్రీమతి మమత సమర్పణలో ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ మాట్లాడుతూ..

English summary

Pawan Kalyan riding two horses at a time