కేంద్రంపై పోరాటం చేయాలంటున్న పవన్

Pawan Kalyan Says TDP Must Fight On BJP For Special Status

05:36 PM ON 30th April, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Says TDP Must Fight On BJP For Special Status

జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కేంద్రంపై కోపం వచ్చింది. కేంద్రంపై పోరాటం చేయాలని అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇస్తున్నందున ప్రత్యేక హోదా అక్కర్లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్‌ చౌదరి శుక్రవారం రాజ్యసభలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. సరిగ్గా రెండేళ్ల కిత్రం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఘోర తప్పిదం చేసిందని పవన్‌ కల్యాణ్‌ అన్నాడు. ఆ రోజు సీమాంధ్ర ప్రజలకు జరిగిన అవమానం ఎవరూ మరిచిపోలేదని పవన్ అంటూ, మరచిపోకూడదన్నారు. ఈ రోజు ‘ప్రత్యేక హోదా’ విషయంలో ఇచ్చిన మాట మీద వెనక్కి తగ్గి, సీమాంధ్ర ప్రజల నమ్మకం మీద కొట్టి భాజపా కూడా అలాంటి తప్పువైపే అడుగులు వేయకూడదని కోరుకుంటున్నట్లు పవన్ అంటున్నాడు. ప్రత్యేకహోదా గురించి ప్రజలు రోడ్ల మీదకొచ్చి ఉద్యమించే లోపే అధికార పార్టీ ఎంపీలు, ప్రతిపక్షాలను కూడా కలుపుకొని పార్లమెంట్‌లో దీని మీద పోరాటం చేయాలని సీమాంధ్ర ప్రజల తరపున విన్నవిస్తున్నట్లు పవన్‌ సూచించాడు.

ఇవి కూడా చదవండి: పెళ్లిలో గన్ ఫైర్.. కుప్పకూలిన పెళ్ళికొడుకు(వీడియో)

ఇవి కూడా చదవండి:మాంసం తిన్నారో ఇక అంతే

English summary

Power Star Pawan Kalyan suggested Telugu Desham Party to fight along with all parties in Andhra Pradesh for Special Status to AP. He posted this in his Twitter Account.