పవర్‌స్టార్‌కు కూడా వాటితో ఇబ్బందా???

Pawan Kalyan Says That Dance is Difficult Task To Him

11:33 AM ON 19th February, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Says That Dance is Difficult Task To Him

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌'. శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'పవర్‌' ఫేమ్‌ కె. ఎస్‌. రవిందర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పవర్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, రాయ్‌లక్ష్మీ, సంజన హీరోయిన్లుగా నటించారు. అయితే నిన్నటితో ఈ చిత్రానికి సంబందించి టాకీ భాగం షూటింగ్‌ మొత్తం పూర్తయిందట. ఇప్పుడు పాటలు చిత్రీకరణ మొదలు పెడతారట. అయితే పవన్‌ కి సినిమాలో అత్యంత కష్టంగా ఫీల్‌ అయ్యేది పాటలు చిత్రీకరణ సమయంలోనేనట. ఎందుకంటే పవన్‌ కి సరిగా డ్యాన్స్‌ సరిగా రాదని చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆ విషయాన్ని పవన్‌ వెల్లడించాడు. ఎంత కష్టమైనా అభిమానులు కోసం డ్యాన్స్‌ చేస్తా. నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా డ్యాన్స్‌ కంపోజ్‌ చేయించుకుంటున్నా అని పవన్‌ తెలియజేశారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు ఇక్కడే చిత్రీకరించి, మిగతా రెండు పాటలు యూరప్‌లో చిత్రీకరించనున్నారట. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

English summary

At present Power Star Pawan Kalyan was busy with his latest Movie Sardar Gabbar Singh which was going to release on this summer.This movie was directing by Power Movie fame Babi.Pawana says that Dance is a difficult task to him but he said that he will dance for his fans.