తన సినిమాల్లో కళలకు ప్రాధాన్యమిస్తానన్న పవన్

Pawan Kalyan says that i will give importance for arts in my movies

11:20 AM ON 11th July, 2016 By Mirchi Vilas

Pawan Kalyan says that i will give importance for arts in my movies

కళ అనేది సంస్కృతిలో అంతర్భాగం, మన భాష, యాసని మర్చిపోకూడదు అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నాడు. లండన్ లో జరిగిన యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్ 6వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఆయన తెలుగు జాతి కళలను, సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని కొనియాడారు. తెలుగు సంప్రదాయాల్ని భావితరాలకు పంచేందుకు ఈ తరహా ఉత్సవాలు ఎంతో సాయం చేస్తాయని అభిప్రాయపడ్డారు. సంస్కృతి, కళలను ఇప్పటి తరానికి తెలియజేయడంలో తల్లిదండ్రులు పాత్ర ఎంతో ముఖ్యమైనదన్నారు. తెలుగువారి జీవితాల్లో ఇలాంటి వాటికి చాలా ప్రాధాన్యం ఉందని, వీటిని ప్రమోట్ చేసేందుకు ఇక్కడి ఎన్నారైలు ముందుకు రావాలని ఆయన కోరాడు.

తన సినిమాల్లో కళలకు ప్రాధాన్యం ఇస్తానని, తెలుగు జానపద గీతాలకు ఇంపార్టెన్స్ ఉండేలా చూస్తానని పవన్ చెప్పాడు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో దశావతారం, మహిషాసురమర్థని, యక్షగానంతో పాటు రకరకాల నాటకాలు, జానపద నృత్యాలు ప్రదర్శించారు. ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన కళాకారులకు పవన్ కల్యాణ్ జ్ఞాపికలను బహూకరించాడు.

1/5 Pages

English summary

Pawan Kalyan says that i will give importance for arts in my movies