మహేష్‌ని కామెంట్‌ చేసిన పవన్‌

Pawan Kalyan scolds Mahesh Babu

03:54 PM ON 16th March, 2016 By Mirchi Vilas

Pawan Kalyan scolds Mahesh Babu

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమా సెట్స్‌లో ఉండగా ఎన్‌డీటీవి జర్నలిస్ట్‌ అనుపమ చోప్రా పవన్‌ని ఇంటర్‌వ్యూ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇంటర్‌వ్యూలో భాగంగా అనుపమ పవన్‌ని మీరు యాడ్స్‌లో ఎందుకు నటించడం లేదని అడగగా పవన్‌ మహేష్‌ పై సంచలన కామెంట్స్‌ చేశాడు. అసలు విషయంలోకి వస్తే పవన్‌ అనుపమతో ఈ విధంగా అన్నారు. నాకు యాడ్స్‌లో నటించడం ఇష్టం లేదు, అయితే 'ఖుషి' సినిమా టైమ్‌లో 'పెప్సీ' యాడ్‌లో మాత్రం నటించాను. కానీ నా దృష్టిలో మనం చేస్తున్న యాడ్‌ ప్రొడక్ట్‌ని మనం వాడకుండా ప్రజలని వాడమని చెప్పడం నాకు ఇష్టం లేదు.

అందుకే యాడ్స్‌ చెయ్యడం మానేశా అయినా యాడ్స్‌ చేసి డబ్బు సంపాదించాలనే ఆలోచన నాకు లేదని పవన్‌ చెప్పారు. ఈ ఇంటర్‌వ్యూ చూసిన మహేష్‌ అభిమానులు వెంటనే పవన్‌ పై మండి పడ్డారు. దానికి కారణం లేకపోలేదు, ఎందుకంటే టాలీవుడ్‌లో ఎక్కువ యాడ్స్‌ చేస్తున్న హీరో మహేష్‌ మాత్రమే. అయితే పవన్‌ ఆ మాట మహేష్‌ ని నేరుగా అనకపోయినా పరోక్షంగా మాత్రం మహేష్‌ని అన్నట్లు చెప్తున్నారు. కానీ పవన్‌ ఎవరిని ఉద్ధేశంలో పెట్టుకుని ఈ మాట అన్నాడో పవన్‌కే తెలియాలి. దీని పై పవన్‌ పెదవి విప్పితేనే ఒక క్లారిటీ వస్తుంది.

పవన్ చేసిన పెప్సీ యాడ్ ఇదే:

English summary

Power Star Pawan Kalyan scolds Super Star Mahesh Babu in an interview. He gave a interview to Anupama Chopra. In that he scolds Mahesh Babu indirectly.