ప్రభాస్‌ ఫ్యాన్స్‌ని హర్ట్‌ చేసిన పవన్‌

Pawan Kalyan sensational comments on Baahubali movie

12:06 PM ON 4th May, 2016 By Mirchi Vilas

Pawan Kalyan sensational comments on Baahubali movie

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకోని నటుడు. పేరుకి సినిమా హీరోనే అయినా సినిమాల గురించి తక్కువగా మాట్లాడతాడు పవన్‌. అంతేకాదు ఆడియో వేడుకలకి, అవార్డు వేడుకలకి పవన్‌ ఎప్పుడూ దూరం. అయితే ఇలాంటి పవన్‌ తాజాగా తాను మాట్లాడిన మాటలతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి టార్గెట్‌ అయ్యాడు. అసలు విషయంలోకి వస్తే 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రాన్ని హిందీలో ఎందుకు విడుదల చేశారు అన్న ప్రశ్నకు బదులుగా పవన్‌ చెప్పిన సమాధానం ఇద్దరు స్టార్‌ హీరోల అభిమానుల మధ్య సైలెంట్‌ వార్‌ కి తెరలేపింది. పవన్‌ ఏం సమాధానం ఇచ్చారో ఆయన మాటల్లోనే...

'తమిళ సినిమాలకు మన దగ్గర గొప్ప మార్కెట్‌ ఉంది. కానీ మనకు అక్కడ ఏ మాత్రం మార్కెట్‌ లేదు. మనం ఇక్కడ 40-50 కోట్లు పెట్టి తీసే సినిమాను తమిళంలో 50 లక్షలకు కూడా ఎవరూ కొనరు. కానీ తమిళంలో 30 కోట్లు పెట్టి సినిమా తీస్తే రెండొంతుల కలెక్షన్స్‌ తెలుగులోనే వచ్చేస్తాయి. మన సినిమాల్ని వేరే భాషల్లోకి తీసుకు వెళ్లడానికి ఎప్పుడూ ఏ నిర్మాతలు ధైర్యం చెయ్యలేదు. మనం 'మగధీర' చిత్రాన్నే తీసుకుంటే గనుక అదొక అద్భుతమైన సినిమా. కానీ దాన్ని వేరే భాషల్లోకి సరిగా ప్రమోట్‌ చేయలేదు. 'బాహుబలి' కంటే ముందే దాన్ని హిందీలో రిలీజ్‌ చెయ్యాల్సింది.

అలా చేసి ఉంటే 'బాహుబలి' కంటే బాగా ఆడేది. ఇప్పటికైనా మన నిర్మాతలు మేల్కొంటే మన తెలుగు సినిమాలకు వేరే భాషల్లో కూడా మార్కెట్‌ ఏర్పడుతుంది. అందుకే రిజల్ట్‌ ఎలా ఉంటుందో అని ఆలోచించకుండా 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' హిందీలో రిలీజ్‌ చేశాం. అంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పు ఉద్ధేశ్యం లేకపోయినా ఈ మాటలను ప్రభాస్‌ అభిమానులు మాత్రం చాలా సీరియస్‌గా తీసుకున్నారట. నేషనల్‌ అవార్డ్‌ గెలుచుకున్న 'బాహుబలి' చిత్రాన్ని మగధీర వంటి చిత్రంతో పోల్చడం సరి కాదని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ వాదన. మొత్తానికి పవన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రభాస్‌ అభిమానుల్ని నిరుత్సాహ పరిచాయి.

English summary

Pawan Kalyan sensational comments on Baahubali movie. Power Star Pawan Kalyan hurts Young Rebel Star Prabhas fans with his comments.