నోట్ల రద్దుపై రాసిన కవితను షేర్ చేసిన పవర్ స్టార్

Pawan Kalyan shared a poem in social media

12:49 PM ON 21st November, 2016 By Mirchi Vilas

Pawan Kalyan shared a poem in social media

'మెతుకూ మెతుకూ కూడబెట్టి ముద్ద పోగేస్తే.. దొంగ కూడంటున్నారన్నా.. నేనెట్టా బతికేది. కన్నీటి బొట్టూ బొట్టూ దాపెట్టి ఏడుపు పోగేస్తే.. నా ఏడుపు చెల్లదంటున్నారన్నా నేనెట్టా చచ్చేది..' పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడు పడుతున్న యాతనను సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ హృద్యమైన కవితగా మలిచాడు. ఈ కవిత ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. అయితే ఎవరెవరో షేర్ చేయడం వేరు. ఈ కవిత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ షేర్ చేయడం చర్చనీయం అయింది. అంతేకాదు, కొత్త కరెన్సీపై కేంద్ర వైఖరి ఏమిటో కేంద్రం వెల్లడించాలని పవన్ ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేసాడు.

గ్రామీణర్థిక వ్యవస్థ, పట్టణాల్లోని అసంఘటిత మార్కెట్ వ్యవస్థల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ సిటిజన్స్ గురించి పట్టించుకోవాలని, ప్రజల్లో అశాంతి తొలగించాలని డిమాండ్ చేయడం విశేషం.

English summary

Pawan Kalyan shared a poem in social media