పవన్ ఎందుకు  నోరు మెదపడం లేదు

Pawan Kalyan Silent On Sardaar Distributors Loss

10:31 AM ON 18th April, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Silent On Sardaar Distributors Loss

మొత్తానికి ప్రస్తుతం టాలీవుడ్ అంతా పవన్ గురించే చర్చ ... ఈ సినిమా ప్లాప్ టాక్ నడవడం, డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవాలనే విజ్ఞప్తి రావడం గురించి వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్’ ఫ్లాప్‌తో నష్టపోయామని ఆందోళన చెందుతున్న డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ ముందుకు రావడం లేదనే కామెంట్స్ వినపడుతున్నాయి. తన ఫ్రెండ్ శరత్ మరార్‌తో కలిసి పవన్ స్వయంగా ఈ సినిమా తీశాడు. హిందీ వెర్షన్‌లో ఈ మూవీ కనీసం 25 శాతమైనా పెట్టుబడులను రాబట్టలేక పోయిందని, తమ నష్టాన్ని ఈ హీరో గానీ, శరత్ మరార్ గానీ భర్తీ చేస్తారని ఆశిస్తున్న పంపిణీదారులకు ఏం చేయాలో తోచడంలేదని ట్రేడ్ ఎనలిస్టులు అంటున్నారు.అసలు ఈ సినిమా ఫ్లాప్ అయిందన్న విషయాన్ని కూడా పవన్ అంగీకరించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పవన్ స్పందించి తమ లాసెస్ విషయంపై దృష్టి పెడతాడని, తమకు న్యాయం జరుగుతుందని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. ఇంతకీ పవన్ ఏమంటారు మరి ..

ఇవి కూడా చదవండి:

సూపర్ స్టార్ బావ 'దూకుడు'

ఆ నెంబర్ కోసం 10న్నర లక్షలు పోశాడు

బన్నీ మూవీకి బంపర్ ఆఫర్

పూరీ పై 'లోఫర్' దాడి

English summary

Power Star Pawan Kalyan's Sardar Gabbar Singh Movie was become disaster and the distributers of this film were in deep loss . Pawan Kalyan was not responded on this and distributers were demanding to cover their loss.