గాయపడ్డ అకీరా.. హాస్పిటల్ కి తీసుకెళ్తే పట్టించుకోని డాక్టర్లు

Pawan Kalyan son Akira Nandan injured in cycle accident

05:08 PM ON 9th May, 2016 By Mirchi Vilas

Pawan Kalyan son Akira Nandan injured in cycle accident

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ ల తనయుడు అకీరా నందన్ సైకిల్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని రేణుదేశాయ్‌ తన ట్విట్టర్‌ అకౌంట్ ద్వారా తెలియజేసింది. ప్రమాదం జరిగిన వెంటనే అకీరాను ఆసుపత్రికి తీసుకెళ్లామని, కానీ డాక్టర్లు, నర్స్ లు, హాస్పిటల్ సిబ్బంది వెంటనే వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసింది. పెద్ద ఆసుపత్రులకు వైద్యం కోసం వెళ్లడం కన్నా నేరుగా చనిపోవడం మంచిదని ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్ల నుంచి నర్సుల వరకు మొత్తం వ్యవస్థ నిర్లక్ష్యం మానవత్వాన్ని చంపేస్తోందని ట్వీట్‌ చేసింది.

సామాన్యులే కాదు చివరకు సెలబ్రిటీలు సైతం ఇలా ఆసుపత్రుల్లో అవస్థలు పడాల్సి రావడం నిజంగా బాధాకరం.. ప్రస్తుతం రేణు దేశాయ్ తన పిల్లలు అకీరా, ఆద్యాతో కలిసి పూణే లో ఉంటుంది.


English summary

Pawan Kalyan son Akira Nandan injured in cycle accident. Pawan Kalyan son Akhira injured when he was cycling at home.