పవన్ స్పీచ్ లో జోరు పెరిగినా... క్లారిటీ వచ్చేసినట్టేనా?

Pawan Kalyan speech in Kakinada meeting

12:58 PM ON 10th September, 2016 By Mirchi Vilas

Pawan Kalyan speech in Kakinada meeting

భారత్ మాతాకీ జై అంటూ కాకినాడ ఆత్మగౌరవ సభలో స్పీచ్ మొదలెట్టిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విభజన తీరుకు బాధపడి 11 రోజులు అన్నం మానేశానని చెప్పుకొచ్చారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వున్ననాటినుంచి ఇప్పటివరకూ జరిగిన పరిణామాలను ఆయన వివరించుకొచ్చిన పవన్, మొన్న తిరుపతి సభాకన్నా డోస్ పెంచాడు. ఇక ఆనాటి సభ తర్వాత పలువురు నేతలు చేసిన విమర్శలపై కూడా కౌంటర్ ఇచ్చాడు. స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్రం తీరుని ఎండగట్టాడు. ముఖ్యంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను ఉతికి ఆరేసాడు. విమర్శల జోరు పెంచడంతో క్లారిటీ వచ్చేసిందని, మున్ముందు ఇంకా క్లారిటీ వస్తుందని విమర్శకులు సైతం అంటున్నారు.

1/29 Pages

1. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిస్తే... బిజెపి పొట్టలో పొడిచింది...


రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ వెన్నులో పొడిస్తే, భారతీయ జనతా పార్టీ పొట్టలో పొడిచిందని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తాడు.

English summary

Pawan Kalyan speech in Kakinada meeting