మొత్తానికి అందరినీ కెలికేసిన పవన్...

Pawan Kalyan speech in tirupati

02:53 PM ON 29th August, 2016 By Mirchi Vilas

Pawan Kalyan speech in tirupati

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం విరామం తర్వాత హఠాత్తుగా ఏర్పాటు చేసిన సభలో ఏమి చెప్పాలో క్లియర్ గా లేకున్నా తన ఆవేశాన్ని, ఆవేదనను బహిర్గతం చేసే క్రమంలో ఇంచుమించు ఎవరినీ వదల్లేదు. అందుకే ఒక్క ఉదుటున అందరూ స్పందిస్తూ, ఎవరి స్థాయిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అభిమానులు గొడవలు పడకూడదని సూచించిన పవన్, ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాత్రం నిప్పులు చెరిగారు. ఈ విషయంలో ఎవరినీ మినహాయించలేదు. అందుకే తిరుపతిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ పెట్టిన తరువాత ఏపీ రాజకీయాల్లో కదలిక వచ్చింది. దీనిపై రాజకీయంగా పార్టీలు వ్యక్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లే ప్రజలు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

1/12 Pages

1. బిజేపిపై అస్త్రం...


పవర్ స్టార్ తన ప్రసంగంలో బిజెపిని టార్గెట్ చేశారని చెప్పవచ్చు. ఇదే తిరుపతిలో ఆనాడు మోడీ గారు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారని పవన్ గుర్తుచేశాడు. రెండున్నరేళ్లు అయినా ఇంకా ఇవ్వకపోవడం దారుణమన్నారు. సీమాంధ్రుల మంచితనం, ఆదరణ చూసారని, ఇక సీమాంధ్రుల పౌరుషం, పోరాటం చూస్తారని హెచ్చరించారు.

English summary

Pawan Kalyan speech in tirupati