జనం సమస్యలు తెలుసుకోడానికి పవన్ పాదయాత్ర(వీడియో)

Pawan Kalyan speech on status

11:09 AM ON 12th November, 2016 By Mirchi Vilas

Pawan Kalyan speech on status

అనంతపురంలో సభ తర్వాత అక్కడే బసచేసిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుత్తి గేట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వారి ప్రశ్నలకు ఓపికగా సమాధానమిచ్చారు. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ విద్యార్థులతో జరిగిన ఇష్టాగోష్టిలో మాట్లాడారు. నిరాహార దీక్షల వల్ల ఈ దేశంలో పేదరికం పోతుందంటే తాను దీక్షలు చేయడానికి సిద్ధమేనని అంటున్నాడు. గాంధీయిజం అంటే తనకు ఇష్టమేనని, కానీ అన్ని సమస్యలకూ అది పరిష్కారమార్గం కాదని చెప్పాడు. తాను ఆవేశంగా కాకుండా ఆలోచించే మాట్లాడుతానన్నారు. పవన్ తన స్పీచ్ లో పరోక్షంగా రాజశేఖర్ రెడ్డి సక్సెస్ ఫుల్ ఎన్నికల ప్రణాళిక గుర్తు చేసుకున్నాడు.

సుధీర్ఘ పాదయాత్రతో 2004లో గ్రాండ్ గా అరంగ్రేటం చేసుకున్న వైఎస్ తరహాలోనే తను కూడా ఒక పాదయాత్రను ప్లాన్ చేస్తున్నట్లు చెప్పకనే చెప్పేశాడు. రాయలసీమలోని కరువు ప్రాంతాల పరిశీలన కోసం పాదయాత్ర చేయాలని ఉందన్నాడు. నాకు దాహం ఎక్కువ.. కేవలం ఒక గ్రామాన్నో, జిల్లానోకాదు.. మొత్తం ఏపీనే దత్తత తీసుకోవాలని ఉంది అంటూ పవన్ కళ్యాణ్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. జనం సమస్యలను దగ్గరనుంచి చూసి ఆకలింపు చేసుకోవడానికి పాదయాత్ర దగ్గరిదారిగా జనసేనని భావించినట్టు తెలుస్తోంది.

English summary

Pawan Kalyan speech on status