పవన్ మీసం మెలేసి మాట్లాడుతూ ఫ్యాన్స్ కు చెప్పిందేంటి(వీడియో)

Pawan Kalyan speeches and videos from Ukta celebrations

05:52 PM ON 12th July, 2016 By Mirchi Vilas

Pawan Kalyan speeches and videos from Ukta celebrations

'ఉక్తా' సెలబ్రేషన్స్ లో పాల్గొనటానికి లండన్ వెళ్లిన పవన్ కల్యాణ్, అక్కడి నుంచి రాగానే తన కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. డాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ చిత్రం కోసం పవన్ కొత్త గెటప్ ని కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. మీసం మెలేసి కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలోని పాత్రకి తగ్గట్టుగానే ఆయన ఈ గెటప్ లోకి మారినట్టు టాక్. పవన్ కొత్త చిత్రం త్వరలోనే మొదలుకాబోతోంది కాబట్టే ఈ లుక్ అంటున్నాడు. ఇక లండన్ లోని త్రాక్సిలో నిర్వహించిన యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్(ఉక్తా) 6వ వార్షికోత్సవం, జయతే కూచిపూడి, జయతే బతుకమ్మ సాంస్కృతిక వేడుకల్లో పవన్ పాల్గొన్నారు.

ఆ వేడుకల్ని ఉద్ధేశించి ఆయన మాట్లాడాడు. ఇక ఆయన అక్కడ అభిమానులతో ముచ్చటిస్తూ మాట్లాడాడు. పవన్ అభిమానుల తరుపున అక్కడ అడిగిన అనేక ప్రశ్నలకు పవన్ సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా అజిత్ తో పవన్ మల్టీ స్టారర్ చేస్తారా అనే విషయం గురించి సైతం పవర్ స్టార్ క్లారిటీ ఇచ్చాడు. అక్కడి ఫోటోలు, వీడియోలు మీరు కూడా వీక్షించండి.

1/21 Pages

English summary

Pawan Kalyan speeches and videos from Ukta celebrations