గోవుల నడుమ గోపాలుడే ..

Pawan Kalyan Surprised Sharrath Marar

11:18 AM ON 8th July, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Surprised Sharrath Marar

పచ్చని చెట్లలో మేత మేస్తున్న గోవుల మధ్య ఉన్న ఈ గోపాలుడు ని చూశారా.. ఇతనెవరంటే గోపాల గోపాల చిత్రంతో గోపాలుడిలా అలరించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ . ఎంత చక్కగా ఉందో కదా ఈ దృశ్యం. పవర్ స్టార్ కు ప్రకృతి, పొలాలు అంటే ఇష్టమని అందరికీ తెలిసిన విషయమే! ఫాం హౌస్ లో కూరగాయలు, పండ్ల మొక్కలను తానే స్వయంగా సాగు చేస్తుంటారు. ఇప్పుడు ఈ ఫొటో ఆ విషయాన్ని రుజువు చేస్తోంది కూడా. గురువారం నిర్మాత శరత్ మరార్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. సినిమా గురించి మాట్లాడడానికి ఫాంహౌస్ కు వెళ్లా, మన గోపాల ఇలా ప్రకృతిలో గోవుల మధ్య కనిపించారు అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో న టిస్తున్నారు. గోపాల గోపాల చిత్రంతో కల్సి పనిచేసిన పార్ధ సాని ఇప్పుడు ఈ చిత్రాన్ని ఏ రేంజ్ లోకి తీసుకెళతాడో చూద్దాం

`

English summary

We all well Known that Producer Sharrath Marar and Power Star Pawan Kalyan were very close and good friends and recently Sharrath Marar went to Pawan Kalyan Form house and surprisingly Pawan Kalyan Spotted with Cattle around him and this pic was posted by Sharrath Marar in his twitter account.