ఎస్.జే. సూర్య సినిమాకి పవన్ తీసుకుంటున్న పారితోషకం ఎంతో తెలుసా?

Pawan Kalyan taking 25 crores remuneration for his next movie

06:36 PM ON 19th May, 2016 By Mirchi Vilas

Pawan Kalyan taking 25 crores remuneration for his next movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఖుషి సినిమా తరువాత నుండి పవన్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా కూడా ఆయన రేంజ్ పెరుగుతూనే వచ్చింది గాని, ఎప్పుడూ తగ్గలేదు. అదే తరహాలో ఇప్పుడు మరోసారి పవన్ తన స్టామినా ఏమిటో చూపించినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే, పవన్ తాజాగా తనే కథ, స్క్రీన్ ప్లే అందించి, బాధ్యతలన్నీ తన భుజం పై వేసుకున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా కారణంగా అటు నిర్మాతలతో పాటు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగా నష్టపోయారు.

అందుకే పవన్ తన గొప్ప మనసుతో ప్రస్తుతం ఎస్.జే. సూర్య దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రం ద్వారా ఆ నష్టాలను భర్తీ చేసి, వాళ్ళను ఆదుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ తాజా చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు పవన్ ఏకంగా 25 కోట్లు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజమైతే తెలుగు సినిమా పరిశ్రమలో ఇదే అత్యధిక పారితోషకం కానుందని సమాచారం. దీంతో పవర్ స్టార్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదని అభిమానులు సంబర పడిపోతున్నారు.

English summary

Pawan Kalyan taking 25 crores remuneration for his next movie