అందరినీ ఏడిపించా : పవన్‌ కళ్యాణ్‌

Pawan kalyan talking about sardaar gabbar singh movie script

01:02 PM ON 21st March, 2016 By Mirchi Vilas

Pawan kalyan talking about sardaar gabbar singh movie script

పవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జానీ'. ఆ చిత్రం ప్లాప్‌ అయి చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. జాని చిత్రానికి స్క్రిప్టు, డైరెక్షన్‌ కూడా పవన్‌ చేసాడు. ప్రస్తుతం తాజా చిత్రం సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ చిత్రానికి పవన్‌ కళ్యాణ్‌ స్క్రిప్టు స్వయంగా సమకూర్చుకున్నాడు.

ఈ విషయం పై సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడుతూ ఈ చిత్రంతో జానీలా డిసప్పాయింట్‌ చేయనని నాకా నమ్మకం ఉందని పవన్‌ తెలిపారు. నేను సినిమాల్లోకి రాకముందు ఖమ్మం బార్డర్‌కు వెళ్ళాను. అక్కడ ఇప్పటి చత్తీస్‌ గడ్‌ కూడా టచ్‌ అవుతుంది. ఆప్లేస్‌ చూడగానే ఆప్లేస్‌లో ఓ లవ్‌స్టోరీ చేస్తే బావుంటుందనిపించింది అన్నారు.

‘అంతేకాదు కౌబోయ్‌ తరహాలో ఉండి మనకు దగ్గరగా ఉండేలా సినిమా తీయాలని ఉంది. ఈ స్క్రిప్ట్‌ రాయడానికి నాకు రెండున్నరేళ్లు పట్టింది. ఇంత టైం నన్ను భరించిన శరత్‌ మరార్‌ కు థాంక్స్‌, ఈరోస్‌ సంస్థ సునీల్‌ లుల్లా గారికి ధాంక్స్‌. నాతోటి నటీనటులకు, టెక్నీషియన్స్‌ అందరికీ ధాంక్స్‌’ అని పవన్‌ అన్నారు.

సినిమా ఏఫ్రిల్‌ లో విడుదల కావాలని నేను నిద్రపోలేదు. 50 రోజుల పాటు అందరినీ ఏడ్పించేశాను. డైరెక్టర్‌ బాబీ తో సహా అందరూ ఎంతో సపోర్ట్‌ చేసారు. బాబీకి ధాంక్స్‌ అంటూ పవన్‌ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను సునీల్‌ లుల్లా గారు హిందీలో రిలీజ్‌ చేస్తామన్నారని అంతే తప్ప ఎవరికీ ఈ చిత్రం పోటీగా ఆలోచించలేదని అందరూ బావుండాలని కోరుకుంటున్నా అని అంటూ పవన్‌ స్వీచ్‌ని ముగించారు.

అన్నయ్య మీద రివేంజ్ తీర్చుకోడానికే పిలిచాడా

కుటుంబ బంధాన్ని - రాజకీయాలను వేరు చేసిన పవన్

ఈ స్థాయిలో ఉన్నానంటే అన్నయ్య చలవే .

స్త్రీలు చేసేవి చేయకూడనివి

English summary

The entire story is designed by Pawan Kalyan himself; he is involved with everything in the film, including the story, dialogues and screenplay.