అన్నయ్య సినిమాకు రాని పవన్.. నితిన్ సినిమాకు వస్తున్నాడు

Pawan Kalyan to attend A Aa audio function

12:36 PM ON 30th April, 2016 By Mirchi Vilas

Pawan Kalyan to attend A Aa audio function

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నితిన్ ఎంత పెద్ద అభిమానో మల్లి వేరే చెప్పానక్కర్లేదు. పవన్ కళ్యాణ్ పై నితిన్ తన అభిమానాన్ని చాలా సార్లు ఓపెన్ గానే చాటుకున్నాడు. అప్పట్లో నితిన్ నటించిన ఒక సినిమా ఆడియో ఫంక్షన్ కు సైతం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వచ్చాడు.పవన్ కళ్యాణ్ తన అభిమానికి తాను సొంతంగా పండించిన మామిడి పండ్లను సైతం నితిన్ కు పంపాడు , ఈ విషయాన్నినితిన్ స్వయంగా వెల్లడించాడు కూడా. ఇటీవల నితిన్ హీరో గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన "అ..ఆ.." సినిమా ఆడియో ఫంక్షన్ కు రావాల్సిందిగా నితిన్ కోరగానే పవన్ ఓకే చెప్పాడట. దర్శకుడు త్రివిక్రమ్ కూడా పవన్ కు చాలా మంచి మిత్రుడు కావడంతో నితిన్ ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా రావడానికి పవన్ ఒప్పుకున్నాడట. అ..ఆ.. ఆడియో ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు స్వయంగా నితిన్ తన ట్విట్టర్ ఖాతాద్వారా వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి:సంతానం కోసం భార్యని ఫ్రెండ్ తో అది చేయించాడు!

ఇది ఇలా ఉంటే చాలా కాలం తర్వాత తన అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి చేస్తున్న 150 వ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ కు చిరు కుటుంబ సభ్యులు అందరు వచ్చిన పవన్ మాత్రం రాలేదు.చిరంజీవి150 అనేది మెగా ఫ్యామిలీకి చాలా ప్రెస్టీజియస్ గా మారిన అంశం. దానికి తోడు రామ్ చరణ్ "కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ"పేరుతో ఒక నిర్మాణ సంస్థ ను ప్రారంభించిన కారణంగా, అల్లు అరవింద్ కుటుంబంతో సహా మొత్తం మెగాఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఇలా అన్నయ్య మెగా స్టార్ 150 వ సినిమా ప్రారంభోత్సవానికి రాని పవన్ నితిన్ ఆడియో ఫంక్షన్ కు వెళ్తుండడంతో పవన్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:దాని కోసం భార్యని సుత్తితో కొట్టి చంపేసాడు!

ఇవి కూడా చదవండి:చ ... చ ..13ఏళ్ల బాలికలకు కన్యత్వ పరీక్షలు చేసి మరీ ...

English summary

Young Hero Nithin was a Big Fan Of Power Star Pawan Kalyan. Recenlty Nithin Acted in "A Aa" movie which was directed by Director Trivikram Srinivas Who was a close friend of Pawan Kalyan. Nithin Posted in Twitter that Pawan Kalyan was going to attend as chief Guest to A Aa movie audio launch which was going to be launch on May 2nd.