ఎన్నికల బరిలో పవన్‌కళ్యాణ్‌

Pawan Kalyan To Contest In Elections

04:55 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Pawan Kalyan To Contest In Elections

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో ఒకరైన పవన్‌కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నంత క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఆయనకు దేశవ్యాప్తంగా అనేక మంది అభిమానులున్నారు.

జనసేనపార్టీ పేరుతో ప్రశ్నించడమే ప్రధాన ఎజెండగా ప్రజల ముందుకు వచ్చాడు పవన్‌ . తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్‌ తనదైన ముద్ర వేసాడు. ఇటు ఆంధ్రప్రదేశ్‌ లోను అటు తెలంగాణాలోను రాజకీయంగా తనదైన శైలిలో ముందుకు వెళ్ళిన జనసేన పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేస్తుందనే విషయం పై మాత్రం ఇప్పుటికీ స్పష్టత ఇవ్వలేదు. పవన్‌ కళ్యాణ్‌ తెలుగు ప్రజల కోసం ప్రత్యక్షంగా రావాలని చాలా కాలంగా అభిమానులు చాలా కాలంగా కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం జనసేన పార్టీ ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడం ఖాయం అని తెలుస్తోంది.

త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పోటీచెయ్యాలని జనసేన పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ ను కోరుతున్నారట. హైదరాబాద్‌లో పోటీ విషయాన్ని పక్కన పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో హైదరాబాద్‌ తరువాత అంతటి మహానగరమైన విశాఖపట్నం లో జరగబోయే జీవిఎంసి ఎన్నికల్లో పోటికి పవన్‌ ఒప్పించే పనిలో జనసేన కార్యకర్తలు పడ్డారట. దీని పై పవన్‌కళ్యాణ్‌కు ఒక సర్వే నివేదికను కుడా సమర్పించిన్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేసి జనసేన పార్టీను మరింత బలోపేతం చెయ్యాలని భావిస్తున్నారట . మరి ఈ విషమం పై పవన్‌ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి!!!

'అ....ఆ..' లో పవన్‌ కళ్యాణ్‌!

సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ లో వరుణ్‌ తేజ్‌

సాధారణ తండ్రిలా 'పవన్‌కళ్యాణ్‌' !

'పవన్‌ కళ్యాణ్‌' గొప్ప వ్యక్తి: మోహన్‌బాబు

భజరంగీ భాయిజాన్‌ రీమేక్‌లో పవన్‌కళ్యాణ్‌ ?

English summary