టీవీ 'షో' తో దుమ్మురేపనున్న పవన్

Pawan Kalyan To Give Entry in Small Screen

11:10 AM ON 30th July, 2016 By Mirchi Vilas

Pawan Kalyan To Give Entry in Small Screen

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీరు వేరు. సామాజిక అంశాలపై అవగాహన గల పవన్ ఇప్పుడు ఓ టివి షో కూడా చేయడానికి సన్నద్ధం అవుతున్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ అది ఈ టివిలో వస్తుందట. హిందీలో అమీర్ ఖాన్ చేసిన 'సత్యమేవ జయతే' తరహాలో ఓ కార్యక్రమం పవన్ కళ్యాణ్ తో చేయడానికి ఈటీవీ రెడీ అవుతోందట. సామాజిక ధ్యేయంతో కూడిన ఈ కార్యక్రమం చేయడానికి ఈటీవీ ప్లాన్ చేస్తోంది. అందుకు పవన్ కూడా ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సంబంధించిన పలు సమస్యలను ప్రశ్నించవచ్చని.. అది సామాన్య జనానికి ఉపయోగకరంగా ఉంటుందని పవన్ ఆలోచిస్తున్నాడట.

అంతా బానే వున్నా ప్రస్తుతం పవన్ లాంటి స్టార్ ను హ్యాండిల్ చేసే దర్శకుడి కోసం చూస్తున్నారట. దర్శకుడి ఎంపిక జరగ్గానే ఈ కార్యక్రమం మొదలు కాబోతుందట. దర్శకుడు క్రిష్ అయితే ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా చేయగలడని ఓ ఆలోచన చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన పవన్ ఈ కార్యక్రమం ద్వారా తన భావాలను ప్రజలకు నేరుగా చేరవేయవచ్చని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:దొంగల చేతుల్లో చైనా వాల్.. వారసత్వ సంపద అదృశ్యం!

ఇవి కూడా చదవండి:మోక్షజ్ఞతో త్రివిక్రమ్ మాయాజాలం

English summary

Tollywood Power Star Pawan Kalyan has excellent following in movies as well as in public and now according to a latest updates that Pawan Kalyan was planning to give entry in Small Screen.