ప్రజల్లో మార్పు తెచ్చేందుకు ఆ యాడ్‌లో పవన్‌ 

Pawan Kalyan To Give Voice Over For Cancer Awareness Ad

12:47 PM ON 1st March, 2016 By Mirchi Vilas

Pawan Kalyan To Give Voice Over For Cancer Awareness Ad

ప్రస్తుతం మానవ జాతిలో క్యాన్సర్‌ భయంకర వ్యాధిగా తయారైంది. ఎంతో కాలం నుండి ఈ వ్యాధి మనల్ని పట్టుకు పీడిస్తుంది. ఎంత డబ్బున్నా ఈ వ్యాధి నుండి బయట పడలేకపోతున్నారు. సినీ తారలు అక్కినేని నాగేశ్వరరావు, వెంకటేష్‌, మనీషా కోయిరాలా, మమతా మోహన్‌దాస్‌ లాంటి వారు కూడా ఈ వ్యాధికి గురైనవారే. ఈ వ్యాధికి గురైనవారు ప్రతీ సంవత్సరం దాదాపు లక్షల మంది చనిపోతున్నారు. ఈ క్యాన్సర్‌ బారి నుండి కాపాడుకోవాలంటే కొన్ని రకాల అలవాట్లు, కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్‌ నుండి తప్పించుకోవచ్చు. ఆ జాగ్రత్తలు ప్రజలకి తెలిసేలా ఒక యాడ్‌ని చిత్రీకరిస్తున్నారు. ఈ యాడ్‌లో పవన్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ యాడ్‌తో ఎంతో మందిలో మార్పు వస్తుందన్న అభిప్రాయంతో పవన్‌ ఈ యాడ్‌కి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలుస్తుంది. ఈ యాడ్‌ని త్వరలోనే చిత్రీకరించనున్నారట. ఆ తరువాత ఈ యాడ్‌ని ఆంధ్రా, తెలంగాణా ధియేటర్లలో ప్రదర్శిస్తారట. పవన్‌ ప్రస్తుతం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రంలో నటిస్తున్నారు. 'పవర్‌' ఫేమ్‌ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, సంజన, రాయ్‌లక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

English summary

Power Star Pawan Kalyan to give Voice over for Cancer Awareness Advertisement.This Advertisement to telecast in All Over Andhra Pradesh And Telangana.Presently Pawan Kalyan was acting in Sardar Gabbar Singh Movie under the direction of Bobby.