ముద్రగడ దగ్గరకు పవన్?

Pawan Kalyan To Meet Mudragada Padmanabham

10:56 AM ON 14th June, 2016 By Mirchi Vilas

Pawan Kalyan To Meet Mudragada Padmanabham

తుని ఘటన అరెస్టులకు నిరసనగా ఐదురోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్న నేపధ్యంలో పలువురు నేతలు ఆయన్ను కల్సి, సంఘీభావం తెలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభాన్ని కలుసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేకున్నా, ఇప్పటికే ముద్రగడను పవన్ ఫోన్ లో పరామర్శించారని రేపోమాపో స్వయంగా వెళ్లి కలుస్తారన్నది ఆ వార్తల సారాంశం. ముద్రగడ అంశంపై దృష్టిపెట్టిన పవన్ త్వరలోనే ఈ విషయంపై రాష్ట్రప్రభుత్వంతో కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు. అయితే చంద్రబాబు కోరిక మేరకే పవన్ ముద్రగడను కలువబోతున్నారన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి:చంద్రబాబుపై మెగా ఫైర్

ఇవి కూడా చదవండి:బాబు గారి పై మరోసారి విరుచుకుపడిన జోగయ్య

English summary

According to a recent news that Power Star Pawan Kalyan to meet Kapu Leader Mudragada Padmanabham over his protest.