భజరంగీ భాయిజాన్‌ రీమేక్‌లో పవన్‌కళ్యాణ్‌ ?

Pawan Kalyan To Remake Bajranji Bhaijaan In Telugu

04:53 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

Pawan Kalyan To Remake  Bajranji Bhaijaan In Telugu

బాలీవుడ్‌ లో సల్మాన్‌ఖాన్‌ నటించిన 'భజరంగీభాయిజాన్‌' చిత్రం భారత చలన చిత్ర రికార్డులను తిరగరాసింది. కేవలం 15 రోజులలోనే ఈ చిత్రం 500 కోట్లను సంపాదించింది . ఈ సినిమాకు కధ అందించిన రచయిత విజయేంద్రప్రసాద్‌ మొదట ఈ సినిమాను తెలుగులో తీయాలనుకున్నారట. అయితే ఈ సినిమా బాలీవుడ్‌ లో అయితే మరింత మంచి విజయం సాధిస్తుందని భావించి బాలీవుడ్‌ లో సల్మాన్‌ఖాన్‌ తో తీసారట.

ఇది ఇలా ఉంటే తాజా గా 'భజరంగీ భాయిజాన్‌' సినిమాను తెలుగులో 'పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌' తో రీమేక్‌ చెయ్యనున్నట్లు సమాచారం. ఇప్పటికే దిల్‌రాజు,రాక్‌లైన్‌ వెంకటేష్‌లు ఇద్దరూ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రీమేక్‌ చెయ్యనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ పవన్‌కళ్యాణ్‌ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్‌ ను పవన్‌కళ్యాణ్‌ గబ్బర్‌సింగ్‌తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన హరీష్‌శంకర్‌ దర్శకత్వం వహించునున్నట్లు సమాచారం . అంతా అనుకున్నట్లుగా జరిగితే పవన్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' తరువాత ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్ళే అవకాశాలున్నాయి .

English summary

Bollywood's sensational movie Bajranji Bhaijaan to remake In Telugu. A news came that In this remake Power Star Pawan Kalyan To act as hero and harish shankar as director .Recently Producer Dil Raju met pawankalyan on this remake