మెగా పాటకి పవర్‌ స్టార్ స్టెప్పులు

Pawan Kalyan to Remix Chiranjeevi Song In Sardar

03:21 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Pawan Kalyan to Remix Chiranjeevi Song In Sardar

పాత తరం స్టార్‌ హీరోల పాటలను తీసుకుని రీమేక్‌ చేసి తమ సినిమాల్లో వాడుకుటున్నారు నేటి తరం కుర్ర హీరోలు , ఇలా ఎక్కువగా చేసేది మాత్రం మెగాహీరోలనే చెప్పాలి. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలందరూ చిరంజీవి పాటలను రీమిక్స్‌ చెయ్యడం మనం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న సాయిధరమ్‌ తేజ్‌ రెజీనాల జంటగా, దర్శకుడు హరీష్ శంకర్‌ దర్శకత్వం వహించిన 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' చిత్రంలో 'గువ్వ గోరింకతో' అనే పాటను రీమిక్స్‌ చేసి వాడేసుకున్నాడు. అంతకు ముందు రామ్‌చరణ్‌ కూడా 'వానావానా వెల్లువాయే' పాటను 'రచ్చ' సనిమాలో రీమిక్స్‌ చేసి మంచి మారుల్రు కొట్టేసాడు.

తాజాగా అదే బాటలో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కూడా చేరిపోయాడు. మెగాస్టార్‌ నటించిన కొండవీటి రాజా చిత్రంలో చిరంజీవి- రాధా నటించిన 'నా కోక బాగుందా.. నారైక బాగుందా'.. అనే పాటను పవర్‌ స్టార్‌ రీమిక్స్‌ చేసి సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమాలో ఐటం సాంగ్‌ గా మార్చేసారట. ఈ పాటలో పవర్‌ స్టార్‌ రాయ్లక్ష్మీతో కలసి అదిరిపోయే స్టెప్పులు వేసాడని సమాచారం. చిరు పవన్‌లు కలిసి ఫోటో దిగితినే అదో పెద్ద సెన్సేషన్‌ అవుతుంది. అలాంటిది చిరు పాటకు పవన్‌ స్టెప్పులేస్తే ఆ పాటకు వచ్చే క్రేజే వేరు. సర్దార్‌ సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. కొద్దికాలం క్రిందట సర్దార్‌ సినిమా సెట్లో చిరు హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే ఈ పాట చిత్రీకరణ సమయంలోనే చిరు సర్దార్‌ సినిమా సెట్‌కి వచ్చాడట. పవర్‌ సినిమాలో దర్శకుడిగా మంచి మార్కులందుకున్న బాబి ఈ చిత్రానికి దర్శకుత్వం వహిస్తుండగా, దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రోడ్యూసర్‌ శరత్‌ మారర్‌ కలసి పవన్‌ కళ్యాణ్‌ ఈ సినిమాను స్వయంగా తెరకెక్కిస్తున్నాడు.

English summary

Power Star Pawan Kalyan was presently acting in Sardar Gabbarsingh movie under the direction of Babi.According to a recent update Pawan Kalyan to Remix a song from Kodaveeti Raja Movie which was acted by Mega Star Chiranjeevi.