పవన్‌ రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడా ? 

Pawan Kalyan To Retire From Movies

12:59 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Pawan Kalyan To Retire From Movies

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌లో టాప్‌ హీరోల్లో పవన్‌ కూడా ఒకరు. అలాంటి పవన్‌ సినిమాలకి గుడ్‌బై చెప్పనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వస్తే పవన్‌ 2014 ఎన్నికల సమయంలో 'జనసేన' అనే పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. పవన్‌ ఇప్పుడు నేను ఎన్నికల్లో పాల్గోవడంలేదు, పార్టీని బలోపేతం చేస్తాను, 2019 ఎన్నికల్లో బరిలోకి దిగుతాను, ఈ ఎన్నికలకి మార్రతం 'తెలుగుదేశం' పార్టీకి మద్దతు ఇస్తున్నాను చెప్పడంతో పవన్‌ అభిమానులందరూ 'తెలుగుదేశం' కే ఓట్లు గుద్దారు. అదే అధికారంలోకి వచ్చింది. అయితే పవన్‌ ఈ ఐదు సంవత్సరాలు ఎవరైనా తప్పు చేస్తే వాళ్లని నిలదీసి ప్రశ్నిస్తానని చెప్పాడు.

కానీ పవన్‌ స్టార్‌ హీరో కావడంతో ఇటు పార్టీని పట్టించుకోలేక, అటు సినిమాల్లోను నటించలేక మధ్యలో సతమతమవుతున్నాడు. అందుకే 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రం రెండు సంవత్సరాలైనా ఇంకా రిలీజ్‌ కాలేదు. అయితే ఇప్పుడు పవన్‌ జనసేన పార్టీ ని బలోపేతం చెయ్యడానికి నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వస్తే 2019 ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే పార్టీకి తగిన సమయం కేటాయించాలని పవన్‌ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే 2018 లోపు కనీసం మూడు, నాలుగు సినిమాల్లో నటించి ఆ తరువాత పార్టీపై దృష్టి పెట్టనునాన్నడట.

అంతేకాదు పార్టీని పదేళ్లపాటు కొనసాగించాలంటే కావాల్సిన ఆర్ధికవనరులు కనీసం 100 కోట్లు అయినా సంపాదించాలని పవన్‌ లక్ష్యం పెట్టుకున్నాడట. అందుకోసం తాను నటించబోయే చిత్రాలకి తానే సహ నిర్మాతగా వ్యవహరించాలని అనుకుంటున్నట్లు సమాచారం. తన అఖరు చిత్రాన్ని 2018 సంక్రాంతికి విడుదల చేసేలా పవన్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడట. ఆ తరువాత పూర్తిగా పార్టీ పై దృష్టి పెట్టి ప్రజల్లోనే ఉండాలని పవన్‌ నిర్ణయం తీసుకున్నాడట. అంతే కాదు అమీర్‌ఖాన్‌ 'సత్యమేవ జయతే' టైపులో పవన్‌ కూడా అలాంటి ప్రోగ్రాంకి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి, తన స్నేహితులకి రాజకీయ శిక్షణ ఇచ్చే విధంగా పవన్‌ ఈ ప్రోగ్రాంని రూపొందిస్తున్నాడట.

ఈ కార్యక్రమం 2016 చివరిలో ప్రచారం చేస్తారట. అంతేకాదు పవన్‌ పార్టీని సరిగ్గా పట్టించుకోవడం లేదు ఇంక ప్రజల్ని ఏం పట్టించుకుంటాడడని ప్రతిపక్ష పార్టీలు చాలానే విమర్షించారు. అయితే పవన్‌ వాటన్నిటికీ ప్రస్తుతం మౌనంగా ఉండి, ఒకసారి పార్టీ కొరకు వచ్చాక ఇంక ఎవరేమి చెప్పినా వారికి సరైన సమాధానం ఇవ్వాలని పవన్‌ ఆలోచనట.

English summary

Janasena Political Party President Movie Hero Power Star Pawan Kalyan was busy with his latest film Sardar Gabbar Singh,This movie shooting was going from two years.Pawan kalyan was active in politics and a news that Pawan Kalyan was thinking that he want to retire from movies and he wants to busy in Politics with His Jasnasena Party.