పవన్ సరసన నయనతార!

Pawan Kalyan to romance with Nayanthara

12:42 PM ON 13th October, 2016 By Mirchi Vilas

Pawan Kalyan to romance with Nayanthara

ఇప్పటివరకూ చూడని కాంబినేషన్ ఇది. అవును పవన్ కల్యాణ్ తో నయనతార నటించనుందా? అంటే అవుననే ఫిల్మ్నగర్ వర్గాల టాక్. రీసెంట్ గా పవన్ హీరోగా ఎ.ఎం.రత్నం ఓ మూవీ చేస్తున్నాడు. రెండురోజుల కిందట అందుకు సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగాయి. 'నేసన్' ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులో పవన్, ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నట్లు టాక్. ఈ విషయమై ఫస్ట్ నయనతారని మేకర్స్ సంప్రదించడం, ఆమె దాదాపుగా ఓకే చేసినట్టు కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. స్టోరీ ప్రకారం మరో హీరోయిన్ కూడా వున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి.

ప్రస్తుతం ఈ విషయమై కొంతమంది బ్యూటీలతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నటీనటుల ఎంపిక ఓకే కాగానే సెట్స్ మీదకు వెళ్లడం ఖాయమని అంటున్నారు. వీలైతే సమ్మర్ కి రిలీజ్ చేయాలని రత్నం స్కెచ్ వేస్తున్నాడు. మొత్తానికి నయన్ తో పవన్ జోడీ కొత్తకొత్తగానే ఉంటుంది మరి..

English summary

Pawan Kalyan to romance with Nayanthara