ప్రచారానికి పవన్ షురూ...!

Pawan Kalyan To Support TDP And BJP GHMC Elections

10:51 AM ON 12th January, 2016 By Mirchi Vilas

Pawan Kalyan To Support TDP And BJP GHMC Elections

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని బోగట్టా. నిన్న మొన్నటి దాకా వస్తారో రారో అనిపించినా, ఇటీవల టిఆర్ఎస్ విమర్శల నేపధ్యంలో గ్రేటర్ ప్రచారానికి వచ్చేందుకే నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. వాస్తవానికి గ్రేటర్ ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులను కూడా నిలబెట్ట వచ్చన్న సంకేతాలు అప్పట్లో వచ్చాయి. అయితే తమ తరపున ప్రచారానికి రావాలని బిజెపి - టిడిపి నేతలు ఇటీవల పవన్ ని కల్సి విజ్ఞప్తి చేసారు. దీంతో ఆయన ప్రచారానికి వస్తారా , పార్టీ తరపున కూడా అభ్యర్ధులను నిలబెడతారా ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే రెండు రోజుల క్రితం తెలంగాణ సిఎమ్ కెసిఆర్ కూతురు, ఎంపి కవిత తనపై చేసిన వ్యాఖ్య లను పవన్ సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. అందుకే పవన్.. ఎన్నికల ప్రచారానికి రావాలని డిసైడైనట్లు వినిపిస్తోంది. ఒకవేళ తాను ఎన్నికల ప్రచారానికి రాకపోతే మిగిలిన వారి మాదిరిగానే తాను కూడా కేసీఆర్ కు భయపడి ప్రచారానికి రాలేదన్న విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆస్తులు కాపాడుకునేందుకే తాను ప్రచారానికి రావడం లేదన్న విమర్శలు వస్తే అది తన ఇమేజ్ దెబ్బతీస్తుందని గ్రహించిన పవన్ ప్రచారానికి రావాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.

కొంచెం తిక్కున్న పవన్ కు కేసీఆర్ ఎప్పుడో చుక్కలు చూపించారని పవన్ పై కవిత విమర్శనాస్త్రాలు సంధించారు. సెటిలర్ల ఓట్ల కోసం టిడిపి-బిజెపి నేతలు పవన్ కల్యాణ్ ను ప్రచారానికి తీసుకురావాలనుకుంటున్నాయని అయితే ఎన్నికల ముందు మేకప్ తో వచ్చే పవన్ కల్యాణ్ - ఎన్నికల తర్వాత ప్యాకప్ చెబుతారని కవిత ఘాటైన విమర్శలు చేశారు. ఈ నేపధ్యంలో ఇప్పటివరకూ ప్రచారంపై ఊగిసలాడుతోన్న పవన్ గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి రావాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కవిత విమర్శలకు ప్రచార సభల్లోనే సమాధానం చెప్పడం ద్వారా టిఆర్ఎస్ కి చుక్కలు చూపించాలని పవన్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న మిత్రపక్షాలు ఆయన క్యాంపెయిన్ షెడ్యూల్ ను రూపొందించే పనిలో పడినట్లు తెలుస్తోంది. బహుశా ఈనెల 282930న చంద్రబాబు నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నందున ఆయనతో కలసి ప్రచారం చేయాలా? లేక విడిగా ప్రచారం నిర్వహించాలా అనేది పవన్ ఇంకా ఖరారు చేసుకోలేదు.

మొత్తానికి బాబు పర్యటన తర్వాతనే పవన్ ప్రచారం ఉండవచ్చని వినికిడి. కేవలం కవిత విమర్శలకు జవాబు చెప్పేందుకే పవన్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని టిడిపి వర్గాలు అంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పై విమర్శలతోపాటు గతంలో కేసీఆర్ సీమాంధ్రులపై చేసిన విమర్శలను కూడా ప్రస్తావిస్తారని అంటున్నారు. మరోపక్క పార్టీ కి గుర్తు ఎంచుకోవాలని ఎన్నికల సంఘం ఇప్పటికే పవన్ పార్టీకి వర్తమానం పంపినట్లు తెలుస్తోంది. గుర్తు కేటాయింపు అయ్యాక అభ్యర్ధులను కూడా రంగంలో దింపే యోచన వున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి పవన్ ఎన్నికల ప్రచారానికి రావడం దాదాపు ఖాయం అయినట్లేనని తెలుస్తున్నందున, విమర్శలతో కాలు దువ్విన టిఆర్ఎస్ ఎలాంటి వ్యూహం రచిస్తోంది చూడాలి మరి.

English summary

Power Star Pawan Kalyan To Support TDP and BJP in Greater Hyderabad Municipal Corporation(GHMC ) Elections.Recently MP Kavita speak some contreversial words about pawan kalyan due to that pawan gets andry and he decided to Support BJP and TDP in GHMC Election Campaign