కత్తులు నూరుతున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan To Write A Book Named Nenu Manam Janam

10:55 AM ON 14th September, 2016 By Mirchi Vilas

Pawan Kalyan To Write A Book Named Nenu Manam Janam

మొత్తానికి జనసేన అధినాయకుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాంచి కసి మీద ఉన్నాడట. అందుకే కత్తులు నూరుతున్నారు. కట్టి లాంటి మాటలతో బుక్ తేబోతున్నాడు. ఏపీకి ప్రత్యేకహోదాపై జనంలోకి వచ్చిన, యితడు తన భవిష్యత్ రాజకీయ వ్యూహం రచించడంలో మునిగితేలుతున్నట్లు చెబుతున్నారు. ఇందులోభాగంగానే ఆయన ఒక పుస్తకాన్ని రాస్తున్నట్లు తెలిసింది. పవన్ రాస్తున్న పుస్తకం పేరు నేను-మనం-జనం . మార్పుకోసం యుద్ధమంటూ దీనికి ట్యాగ్ లైన్ పెట్టారని అంటున్నారు.

ఈ పుస్తకంలో జనసేన పార్టీ ఆలోచనా విధానంపై పవన్ కల్యాణ్.. విడమర్చి రాయనున్నట్లు తెలుస్తోంది. రాబోయే మూడునెలల్లో ఈ పుస్తకాన్ని పూర్తిచేసి విడుదల చేయనున్నట్లు అత్యంతవిశ్వసనీయ వర్గాల కధనం. తనదైన రాజకీయ వ్యూహంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతోవున్న పవన్, ఈ పుస్తకం ద్వారా పార్టీ కార్యకర్తలు, అభిమానులతోపాటు ప్రజలకు కూడా చేరువ కావాలని ఇందుకు ఇదే సరైన మార్గమని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అదే నిజమైతే ఈ బుక్ కోసం వేచిచూసే వాళ్ళు చాలామందే వుంటారు.

ఇవి కూడా చదవండి:కోహ్లీ పెద్ద పిసినారి: యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

ఇవి కూడా చదవండి:రైల్వే స్టేషన్లలో నీళ్లు తాగుతున్నారా? అయితే ఒకసారి ఇది చదవండి

English summary

Power Star Pawan Kalyan has huge fan base and he was going forward in his style in Politics and now accoding to the sources he was going to write a book named "Nenu-Janam-Manam" on the present politics and etc. This book was going to release on next three months.