త్రివిక్రమ్, నితిన్ లకు షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!

Pawan Kalyan visits A Aa movie sets

01:34 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Pawan Kalyan visits A Aa movie sets

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'అ..ఆ'. ఇందులో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. నితిన్ సరసన సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. తమిళ హీరోయిన్ అనన్య ఇందులో నితిన్ కి చెల్లెలుగా నటిస్తుంది. ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు-త్రివిక్రమ్ కు మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ 'అ.. ఆ..' సెట్స్ కు వెళ్లి మరీ త్రివిక్రమ్ ని కలిసి కాసేపు మాట్లాడారు. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న నితిన్ పవన్ కు వీరాభిమాని తెలిసిందే. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అక్కడకి రావడంతో నితిన్ షాక్ అయ్యాడట.

అంతే కాదు తన ఆనందాన్ని ఫోటోగా తీసి ట్విట్టర్ లో పెట్టేసాడు. ఈ ఫొటోలో మనకు పవన్, త్రివిక్రమ్ మాట్లాడుకుంటూంటే అక్కడున్న వారందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. నితిన్ అయితే తనకు చాలా నెర్వస్ గా అనిపించిందని, పవన్ ఎదురుగా ఉండటం, చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పాడు. పవన్ 'అ.. ఆ..' సెట్స్ కు మాములుగా వచ్చాడా? లేక తన తదుపరి చిత్రం త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ తో చేయటానికి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి దాని గురించి ఏమైనా మాట్లాడదాం అని వచ్చారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ మాట్లాడతానంటే త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ ఆయన ఫామ్ హౌస్ కో లేక ఆఫీస్ దగ్గరకో వెళ్తారు.

వాళ్లను తన వద్దకు రప్పించుకోవటం ఇష్టం లేక సినిమా కన్ఫర్మ్ చేయటానికి పవన్ ఇలా వచ్చాడంటున్నారు.

English summary

Pawan Kalyan visits A Aa movie sets. Power Star Pawan Kalyan visits suddenly 'A Aa Anasuya Ramalingam vs Anand Vihari' movie sets and talks with Trivikram Srinivas.