సాధారణ తండ్రిలా 'పవన్‌కళ్యాణ్‌' !

Pawan Kalyan visits hit son school event

05:36 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Pawan Kalyan visits hit son school event

ఇది నిజంగా పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ అభిమానులు ఎంతో ఆనందించవల్సిన విషయం. తన కొడుకు అకిరా స్కూల్‌ ఫంక్షన్‌కి పవన్‌కళ్యాణ్‌ హాజరు కావడమే కాకుండా తన కొడుకు డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు సెల్‌ఫోన్‌తో వీడియో కూడా తీశాడు. పవన్‌ సర్దార్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నా కూడా అకిరాని చూడటానికి రావడంతో రేణుదేశాయ్‌ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఈ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ రేణుదేశాయ్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ఈ విషయాన్ని పోస్ట్‌ చేశారు. అకిరా డ్యాన్స్‌ వేస్తుంటే పవన్‌ ఒక స్టార్‌లా కాకుండా ఒక తండ్రిలా వ్యవహరించి అఖిరాని వీడియో తియ్యడం చాలా ఆనందంగా ఉందంటూ తన ఆనందాన్ని పంచుకుంది.

పవన్‌ ఎప్పడూ ఎంత బిజిగా ఉన్నా తన పిల్లలతో గడపడానికే ఎక్కువ ఇష్టపడతారు. పిల్లలు స్కూల్‌ ఈవెంట్స్‌కు తప్పకుండా హాజరవుతారు అని చెప్పింది.

English summary

Pawan Kalyan visits hit son school event and takes a video when Akhira is dancing on the stage.