బ్రహ్మచారిగా ఉండాలనుకుని ఇన్ని పెళ్లిళ్లు...

Pawan Kalyan want to be bachelor in past

11:21 AM ON 11th April, 2016 By Mirchi Vilas

Pawan Kalyan want to be bachelor in past

‘అభిమానం’ అనే పదాన్ని ‘భక్తి’ స్థాయికి తీసుకెళ్లిన హీరో ఎవరంటే పవన్‌ కల్యాణ్‌ అనే చెప్పాలి. హీరోయిజానికి కొత్త ఉత్సాహాన్ని ఇంజెక్ట్‌ చేసిన పవన్ తన ఆలోచనల్ని ‘ఇజం’గా మార్చిన భావకుడు అని అంటారు. సమాజం అంటే ప్రేమ, పుస్తకాలంటే పిచ్చి, చదివింది ఆచరిస్తాడు, ఆచరించేదే చెప్తాడు. పవన్‌లో ఆ నిజాయతే అభిమానులకు నచ్చుతుంది. పవన్‌ కనిపిస్తే.. పవన్‌ మాట్లాడితే.. అంత ఉత్సాహంగా ఊగిపోవడానికి కారణం అదే. ఓవైపు హీరోగా, మరోవైపు జనసేన నేతగా పవన్‌ ద్విపాత్రాభినయం సాగిస్తున్నాడు. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వసూళ్లలో రికార్డుల్ని తిరగరాస్తోంది.

ఇది కూడా చదవండి: సంచలనం.. పృధ్వి సూసైడ్ వీడియో

ఈ నేపధ్యంలో ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్‌వ్యూ లో పవన్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఒకప్పుడు శ్రీశైలం అడవుల్లోకి పారిపోదామనుకున్న పవన్ నిజంగా అలా వెళ్లిపోతే ఇప్పటికీ బ్రహ్మచారిగానే ఉండిపోయే వాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే, 'మా అమ్మ ఇదే అంటుంటుంది, ‘ఒరేయ్‌ బ్రహ్మచారిగా ఉండిపోదామనుకొన్నావ్‌.. ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నావ్..’ అంటూ ఆ రోజుల్ని గుర్తు చేస్తుంది. జీవితమంటే అంతే. ఎప్పుడు ఎన్ని మలుపులు తీసుకుంటుందో చెప్పలేం. ఎలిజిబెత్‌ టేలర్‌ అన్ని పెళ్లిళ్లు చేసుకుంది అంటే ‘అలా ఎలా చేసుకొంటారో’ అనుకొనేవాణ్ని. నా జీవితం అలానే తయ్యారయింది అంటూ చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి: 'శృతి' మించి అందాలు ఆరబోసింది(వీడియో)

English summary

Pawan Kalyan want to be bachelor in past. Power Star Pawan Kalyan want to be bachelor in his past life, but he married three women.