మాట తప్పితే బిజెపికి నష్టమే :పవన్ 

Pawan Kalyan Warns BJP

05:47 PM ON 12th November, 2015 By Mirchi Vilas

Pawan Kalyan Warns BJP

' సీమాంధ్రకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కేంద్రానికి ఎదురుదెబ్బ తగులు తుంది. ఇచ్చిన మాటపై వెనక్కి తగ్గితే బీజేపీకే నష్టం. ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజిపై కేంద్రం నుంచి నిర్ణయం వచ్చాకే భవిష్యత్ నిర్ణయం వుంటుంది. ఒకవేళ ఇచ్చిన హామీలను "అమలు చెయ్యను" అని కేంద్రం అంటే నా రియాక్షన్‌ వేరుగా ఉంటుంది' అని జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న పవన్ ఎపి సిఎమ్ చంద్రబాబుతో సమావేశమయ్యారు. దాదాపు 3గంటల పాటు సమావేశం అయిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. షూటింగ్ కారణంగా అమరావతి శంకుస్థాపన కు రాలేకపోయానని , అందుకే సిఎమ్ చంద్రబాబుని అభినందించడానికి వచ్చానని అయన చెప్పారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు తనదైన శైలిలో ఆయన స్పందించారు. చంద్రబాబుతో తన సమావేశంలో ప్రత్యేక హోదాపై కూడా చర్చించామ ని ఆయన చెప్పారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ప్రశ్నకు "చేస్తామంటున్నారుగా .. చూద్దాం" అన్నారు. కాగా, బీజేపీకి వ్యతిరేక ఫలితాన్నిచ్చిన బిహార్‌ ఎన్నికల తీర్పుపై స్పందించేందుకు పవన్‌ నిరాకరి స్తూ, అది ఇప్పుడు ఎందుకు అంటూ దాటవేశారు. ప్తత్యేక హోదాపై ఉద్యమించడానికి సిఎమ్ స్థాయి కంటే తాను ఎక్కువ కాదని ఆయన పేర్కొంటూ అయినా ఆందోళన కంటే పద్దతి ప్రకారమే సాధించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. బాక్సైట్ తవ్వకాల అంశాన్ని కూడా చర్చించానని ఆయన చెబుతూ గిరిజనులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరినట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై చర్చించలేదని ఆయన స్పష్టం చేసారు. జనసేన ను విస్తరించే డబ్బు తన దగ్గర లేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని , ప్రజలకు అన్యాయం జరిగితే స్పందన ఉంటుందని ఆయన అన్నారు.

English summary

Pawan Kalyan Warns BJP