పవన్ తో ఉన్న ఆ అమ్మాయి ఎవరు?

Pawan Kalyan was changed a lot

10:43 AM ON 30th April, 2016 By Mirchi Vilas

Pawan Kalyan was changed a lot

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ పేరు తెలియని వారు ఉండరు. టాలీవుడ్ లో ఎంత స్టార్ హీరో నో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో కూడా చెప్పక్కర్లేదు. కానీ ఇంత ఫాలోయింగ్ వున్నా కూడా పవన్ పబ్లిక్ లోకి పెద్దగా రారు.. ఇండ‌స్ట్రీలోనూ అంతే, బ‌య‌టా అంతే. త‌న వ‌ర‌కు తాను ప‌రిమితం.. పెద్ద‌గా ఎదుటివారిని క‌లిసేందుకు ఇష్ట‌ప‌డ‌డం అన్న‌ది ఆయ‌న వ్య‌క్తిత్వానికి విరుద్ధం. పార్టీలకు కానీ, ఫంక్షన్స్ కి కానీ పెద్దగా హాజరు కాడు. కానీ ఇదంతా 2014 ఎన్నికల ముందు వరకు. 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

కానీ పోటీ చేయకుండా.. టీడీపీ, బీజేపీ తరపున ప్రచారం చేశాడు. పార్టీ పెట్టాక పవన్ లో చాల మార్పు వచ్చింది. ప్రజలతో పాటు అభిమానులకు కూడా బాగా దగ్గరవుతున్నాడు. ఇందుకు సాక్ష్యమే ఈ సంఘటన. సాధారణంగా పవన్ కళ్యాణ్ షూటింగ్ ప్రాంతానికి బయట వాళ్ళని ఎవర్ని అనుమతించరు. షూటింగ్ పూర్తికాగానే.. ఆయన నేరుగా తన ఇంటికి వెళ్ళిపోతారు. కానీ దానికి భిన్నంగా.. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో పవన్ తో కలిసి ఫొటో దిగాలని ఓ అమ్మాయి కోరగా.. అందుకు పవన్ వెంటనే అంగీకరించాడు. ఆ.. యువతితో కలిసి ఫొటో దిగాడు. సాధార‌ణంగానైతే ఆయ‌న ఇటువంటి వాటికి దూరం.

కానీ ఎందుక‌నో ప‌వ‌న్ మారారు. ఈ మార్పు చూసి ఇండ‌స్ట్రీ జ‌నాలు సైతం ఆశ్చ‌ర్య‌పోతుండగా.. అభిమానులు మాత్రం సంబరం చేసుకుంటున్నారు.

English summary

Pawan Kalyan was changed a lot