కొత్త నోట్లను తెగ పరిశీలిస్తున్న పవన్!

Pawan Kalyan watching deeply new currency

12:37 PM ON 25th November, 2016 By Mirchi Vilas

Pawan Kalyan watching deeply new currency

రూ. 500, రూ. 1000 పాత నోట్లు రద్దవ్వడంతో సరిపడా కొత్త నోట్లు, చిల్లర నోట్లు లేకపోవడంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. కొత్త నోట్ల కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతూ, బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలో నిలబడి ఎలాగోలా కొత్త నోట్లు తెచ్చుకుంటున్నారు. నోటును చూడగానే ఆహా అంటూ మురిసిపోతున్నారు. అప్పటివరకు పడిన కష్టాన్నీ మరిచిపోతున్నారు. కొన్ని చోట్ల 2 వేల నోట్లు ఏటీఎంలలో కూడా దొరికేస్తున్నాయి. అయితే కొత్త 500 నోట్లు ఇంకా అన్ని చోట్లా రాలేదు. అయితే సామాన్యులే కాదు, సెలబ్రిటీలది కూడా కొత్త నోట్లు తీసుకుని సంబరపడిపోవడం జరుగుతోంది. ఇప్పుడు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా సామాన్యుడిలాగే కొత్త నోటును చూసి మురిసిపోతున్నాడు.

1/3 Pages

ప్రస్తుతం కాటమరాయుడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్, కొత్తగా వచ్చిన నోట్లు ఒకదానికొకటి పోల్చి చూస్తున్నారు. రూ. 500 నోటు ఎలా ఉంది? రూ.2 వేల నోటు ఎలా ఉంది? అని చూస్తున్నట్లుగా ఈ ఫోటో ఉంది. నోట్ల మార్పిడిపై ఇప్పటికే పవన్ తన అభిప్రాయాన్ని ప్రకటించారు.

English summary

Pawan Kalyan watching deeply new currency