శ్రీజ పెళ్లిలో పవన్ మూడో భార్య

Pawan Kalyan wife Anna Lezhneva in Srija marriage

12:15 PM ON 2nd April, 2016 By Mirchi Vilas

Pawan Kalyan wife Anna Lezhneva in Srija marriage

ఇటీవలే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండో వివాహం గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. అయితే శ్రీజ ని పెళ్లి కూతురు చేసినప్పుడు గానీ, శ్రీజ పెళ్ళికి గానీ, రిసెప్షన్ కి గాని పవన్ కల్యాణ్ రాలేదు. దీనితో పవన్ రాలేదన్న విషయం పై చాలా చర్చలే జరిగాయి. అయితే ఇప్పుడు తాజాగా  కనిపిస్తున్న ఫోటో లో పవన్‌కల్యాణ్ మూడో భార్య అన్నాలెజ్‌నివా ఉండటం ఇప్పుడు చర్చానీయాంశం గా మారింది. పవన్ రాలేక పోవడంతో తన భార్యని పెళ్ళికి పంపించి ఉంటాడు అని చర్చికుంటున్నారు. శ్రీజను పెళ్లికూతుర్ని చేసిన దగ్గర నుండి అన్ని వీడియోల్లోనూ ఈమె స్పష్టంగా కనిపిస్తుంది.

అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా మంది ఈమె ఎవరంటూ చర్చించుకోవడం మొదలు పెట్టరట. చివరకు ఈమె పవన్ భార్యని తెలుసుకున్నారట. అయితే అన్నాలెజ్‌నివా కి తెలుగు మాట్లాడడం అంతగా రాకపోయినా.. అందరితో సరదాగా, కలివిడిగా ఉన్నట్లు చెబుతున్నారు. అన్నాలెజ్‌నివా పుట్టింది ఆస్ట్రేలియా లోనైనా, చక్కగా, సాంప్రదాయంగా చీర కట్టుకుని వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అన్నాలెజ్‌నివా ఆస్ట్రేలియా కి చెందిన నటి, మోడల్ కూడా. ‘తీన్‌మార్’ సినిమాలో పవన్‌తో కలిసి చిన్న సన్నివేశంలో నటించింది. తీన్మార్ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం కుదిరి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వివాహానికి దారి తీసిందని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 

అయితే ఆ వార్తలు వచ్చినా అన్నాలెజ్‌నివా ఎప్పుడు బయట కనిపించలేదు. అయితే ఇప్పుడు శ్రీజ మ్యారేజ్‌లో కనిపించడం ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

1/23 Pages

English summary

Pawan Kalyan wife Anna Lezhneva in Srija marriage. Pawan Kalyan 3rd wife Anna Lezhneva in Srija second marriage.