సర్దార్‌ కోసం పవన్ సరికొత్త ప్లాన్‌

Pawan Kalyan working with 2 units for Sardar Gabbar Singh

05:03 PM ON 9th February, 2016 By Mirchi Vilas

Pawan Kalyan working with 2 units for Sardar Gabbar Singh

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. 'పవర్‌' ఫేమ్‌ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, రాయ్‌లక్ష్మీ, సంజన హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే పవన్‌ ఈ చిత్రానికి ఎన్నడూ లేని విధంగా తన కెరీర్‌లోనే మొదటిసారి రెండు యూనిట్లుతో పని చేస్తున్నాడు. ఏప్రిల్‌ 8న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడం కోసం పవన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడట. అందుకోసం రెండు యూనిట్లుని రంగంలోకి దించాడట పవన్‌. ఒక యూనిట్‌తో మెయిన్‌ స్టార్స్‌తో ముఖ్య సన్నివేశాలు తెరకెక్కిస్తుంటే దర్శకుడు బాబీ దీనిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడట.

మరో పక్క కో-డైరెక్టర్‌ కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. మార్చి మొదటి వారానికళ్లా సర్దార్‌ ఘాటింగ్‌ ని పూర్తి చేసి, ఆ తరువాత పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించాలని పవన్‌ ప్లాన్‌. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. పవన్‌ స్నేహితుడు శరత్‌ మరార్‌ ఈ చిత్రానికి నిర్మాత.

English summary

Power star Pawan Kalyan working with 2 units for Sardar Gabbar Singh movie for first time in his carrier. Power fame Bobby is directing this movie. Kajal Agarwal is romancing with Pawan in this movie.