ఇంతకీ పవన్ కళ్యాణ్ ఈ ఫోన్ ఎక్కడ కొన్నారో తెలుసా?

Pawan Kalyan's iphone 6 plus phone story

12:04 PM ON 8th February, 2017 By Mirchi Vilas

Pawan Kalyan's iphone 6 plus phone story

ఓ పక్క సినిమాల్లో ఉంటూనే మరోపక్క జనసేన ద్వారా ట్వీట్ల వర్షం కురిపిస్తూ, చర్చగా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వాడుతున్న ఫోన్ ఇపుడు హాట్ టాపిక్ అయింది. ఇంతకీ పవన్ కళ్యాణ్ వాడుతున్న ఫోన్ ఏంటో తెలుసా? ఆపిల్ కంపెనీ రూపొందించిన ఐఫోన్ 6 ప్లస్ ఫోన్ పవన్ ఉపయోగిస్తున్నారు. ఈ ఫోన్ కొన్న తర్వాత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో మరింత యాక్టివ్ అయ్యారని, దీని ద్వారా ఆయన సులభంగా ట్వీట్లు చేస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. సంగీతం వినడం, పుస్తకాలు చదవడాన్ని బాగా ఇష్టపడే పవన్ కళ్యాణ్ ఈ ఫోన్ కొన్న తర్వాత మరింత సౌకర్యంగా ఫీలవుతున్నారని టాక్. తాను ఇష్టపడే, చదవాలనుకున్న పుస్తకాలను పీడీఎఫ్ ఈ బుక్స్ రూపంలో ఫోన్ లో లోడ్ చేసుకుని సమయం దొరికినప్పుడల్లా సులభంగా చదివేస్తున్నారట. ఐట్యూన్స్ ఉపయోగించి సంగీతం వినడం లాంటివి చేస్తున్నారట.

ఇంతకీ ఈ ఫోన్ ని తన భార్య అన్నలెజెనివాతో కలిసి ఆ మధ్య ఆస్ట్రేలియా వెళ్లినపుడు పవన్ కొన్నాడట. అప్పటి నుండి ఎంతో ఇష్టంగా ఈ ఫోన్ వాడుతున్నాడట. సన్నిహితులకు, కుటుంబ సభ్యలకు ఏదైనా మెసేజ్ పంపాలంటే, పవన్ కళ్యాణ్ దాన్ని ఓ పేపర్ మీద రాసి, ఫోటో తీసి పంపుతాడట .

ఇది కూడా చూడండి: బియ్యం కడిగిన నీటిని ఇలా కూడా వాడొచ్చా..

ఇది కూడా చూడండి: జుట్టు వేగంగా పెరగటానికి టీ ట్రీ ఆయిల్

English summary

Pawan Kalyan is using iphone 6 plus phone it will be a hot topic for all.