పవన్ చివరి సినిమా డైరెక్టర్ ఇతనేనా?

Pawan Kalyan's last movie director

05:49 PM ON 9th May, 2016 By Mirchi Vilas

Pawan Kalyan's last movie director

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అతి త్వరలోనే సినిమాల నుండి వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు పవన్‌ సినిమాలకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ ఈ ప్రకటన చేశాడు. ఇంకా మూడు నాలుగు సినిమాల్లో మాత్రమే పవన్‌ కళ్యాణ్‌ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకు మించి పవన్‌ నటించాలనే ఆసక్తి కనబర్చడం లేదు అని తెలుస్తోంది. ఇక ఈ మూడు నాలుగు సినిమాల్లో ఒక సినిమా ఎస్‌. జే. సూర్య దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఆ సినిమా షురూ అయ్యింది. ఆ తర్వాత దాసరి నారాయణ రావు నిర్మాణంలో ఒక సినిమా ఉండబోతుంది.

ఆ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఇక పవన్‌ చివరి సినిమా గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతుంది.. పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో చివరి సినిమాను ఆయన ఆప్త మిత్రుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇద్దరి కాంబినేషన్‌లో ‘జల్సా’ మరియు ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ రెండు సినిమాలు కూడా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాయి. పవన్‌తో సినిమా గురించి త్రివిక్రమ్‌ చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే ఒక స్టోరీ లైన్‌ కూడా అనుకున్నారు. పవన్‌ చివరి సినిమా, ప్రతిష్టాత్మకం కనుక త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేస్తే దానికి సార్థకత ఉంటుందని పవన్‌ కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఆ చివరి సినిమా ఎప్పుడు ఉంటుందనేది మాత్రం తెలియదు. సార్వత్రిక ఎన్నికల ముందే ఆ సినిమా ఉంటుందని మాత్రం చెప్పగలం అని సినీ వర్గాల వారు అంటున్నారు.

English summary

Pawan Kalyan's last movie director. Power Star Pawan Kalyan last movie director will be Trivikram Srinivas or somebody else.